Share News

ఎండల్లో చలచల్లగా...

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:13 AM

వేసవిలో వేడి సహజం. ఫలితంగా శరీరంలోనూ వేడి పుడుతుంది. దాంతో అలసట, బడలిక కలుగుతాయి. విపరీతమైన స్వేదం, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఒంట్లో వేడి పెరగడం వల్ల కలిగేవే!

ఎండల్లో   చలచల్లగా...

ఈ వేసవి ప్రతాపంతో ఒంట్లోని ఓపికంతా ఆవిరైపోతోంది.

వేడి వాతావరణాన్ని తట్టుకోలేక నీరసం ఆవహిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి

జాగ్రత్తలు తీసుకోవాలో

తెలుసుకుందాం!

వేసవిలో వేడి సహజం. ఫలితంగా శరీరంలోనూ వేడి పుడుతుంది. దాంతో అలసట, బడలిక కలుగుతాయి. విపరీతమైన స్వేదం, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఒంట్లో వేడి పెరగడం వల్ల కలిగేవే!

ఎండ ప్రభావం

ఎండ వేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 104 డిగ్రీలకు చేరుకుంటే ఎండదెబ్బకు గురవుతాం! అత్యధిక ఉష్ణోగ్రతలకు గురయినా లేక వేడి వాతావరణంలో శారీరక శ్రమ వల్ల శరీర ఉష్ణోగ్రత ఆ మేరకు చేరుకున్నా ఎండదెబ్బకు గురవడం సహజం. ఈ రెండు సందర్భాలను వివరంగా చెప్పుకోవాలంటే....

వేడి వాతావరణానికి బహిర్గతం కావడం: ఎక్కువ సమయంపాటు ఎండలో గడపడం వల్ల శరీర కేంద్ర ఉష్ణోగ్రత (కోర్‌ టెంపరేచర్‌) పెరుగుతుంది. ఇలాంటి స్థితి వేడిగా, తేమగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయంపాటు గడపడం వల్ల సంభవిస్తుంది.

శారీరక శ్రమ: వేడి వాతావరణంలో అత్యధిక శారరీక శ్రమకు గురయినా శరీర కేంద్ర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి ఎండదెబ్బకు గురవుతాం. ఆ స్థితిలో అయోమయం, స్పృహ కోల్పోవడం, వాంతులు, ఒళ్లు వేడిగా మారడం, శ్వాస, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు

ఎలాంటి ఎండదెబ్బకు గురయినా అందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి ఏవంటే....

గాలి ధారాళంగా చొరబడని దుస్తులు, చమటను పీల్చుకునే వీలు లేని దుస్తులు ధరించడం. వేడిని గ్రహించే వీలున్న నల్ల దుస్తులు ధరించడం.

మద్యం తీసుకోవడం. మద్యం తాగడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే శక్తి శరీరం కోల్పోతుంది.

స్వేదం ద్వారా శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోవడం.

నివారణ తేలికే!

ఎండదెబ్బకు గురయి బాధ పడేకంటే, ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు. వేసవి వేడి, ఎండల ప్రభావానికి గురవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి

దుస్తులు: ధరించే దుస్తులు తేలికగా, గాలి చొరబడేలా, చమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంతవరకూ తెల్లని దుస్తులే ధరించాలి.

సూర్యరశ్మి: సూర్యరశ్మి నేరుగా సోకితే, శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్‌స్ర్కీన్‌ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది.

దాహం వేసేవరకూ ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతోపాటు కొబ్బరినీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతూ ఉండాలి. ఇలా ఒంట్లో నీటి పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయాల్లో నీడ పట్టున గడపాలి. వ్యాయామానికి ఎండ లేని సమయాలను కేటాయించాలి.

దాహం తీరట్లేదా?

ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఏం చేయాలో అర్థం కాదు. వేసవిలో కొందరి పరిస్థితి ఇది. ఇలా మీకూ అనిపిస్తూ ఉంటే, గ్లాసుడు నీళ్లలో ఒక స్పూను తేనె కలుపుకుని తాగి చూడండి. ఆ తర్వాత తాగే నీళ్లతో మీ దాహం తీరడం ఖాయం. అన్నట్టు, చల్ల నీళ్లతో దాహం తీరదు. ఫ్రిజ్‌లో నుంచి గడ్డకట్టిన నీళ్ల బాటిల్‌ తీసి తాగటం వృథా! అతి చల్లని నీళ్లు జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆలోగా ఒంట్లోని ప్రతి కణం దాహార్తితో అల్లాడిపోతుంది. కాబట్టి జీర్ణాశయం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా గోరు వెచ్చని నీళ్లు తాగితే దాహం తీరుతుంది.

చెమట పొక్కులకు చక్కని చిట్కాలు

వేసవిలో చెమటను భరించటమే కష్టం. దీనికి చెమట పొక్కులు తోడైతే ఇక ఆ చిరాకును మాటల్లో చెప్పలేం. ఈ చెమట పొక్కులు మంట పెట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

మెత్తగా పొడి చేసిన ఓట్లను చల్లని నీళ్లతో నింపిన స్నానాలతొట్టిలో వేసి కలపాలి. నీళ్లు పాల రంగులోకి మారాక స్నానాలతొట్టిలో 30 నిమిషాలు సేదతీరాలి. తర్వాత మెత్తని టవల్‌తో తడి అదుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చెమట పొక్కులు వదులుతాయి.

వస్త్రంలో ముంచు ముక్కలు మూటగట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే 3 రోజులకి చెమట పొక్కులు మరింత పాకకుండా తగ్గిపోతాయి.

గంథం పొడి, గులాబీనీరు సమపాళ్లలో కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో పూయాలి. పూర్తిగా ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

ఒక కప్పు చల్లని నీళ్లలో ఒక టీస్పూను బేకింగ్‌ సోడా కలిపి, ఆ నీళ్లలో పలుచని వస్త్రం నానబెట్టి పిండేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద 10 నిమిషాలు ఉంచినా ఉపశమనం కలుగుతుంది.

ముల్తాని మట్టికి రోజ్‌వాటర్‌ చేర్చి ముద్దలా చేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద పూసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి పూసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

వేసవిలో వేడి సహజం. ఫలితంగా శరీరంలోనూ వేడి పుడుతుంది. దాంతో అలసట, బడలిక కలుగుతాయి. విపరీతమైన స్వేదం, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఒంట్లో వేడి పెరగడం వల్ల కలిగేవే!

ఎండ ప్రభావం

ఎండ వేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 104 డిగ్రీలకు చేరుకుంటే ఎండదెబ్బకు గురవుతాం! అత్యధిక ఉష్ణోగ్రతలకు గురయినా లేక వేడి వాతావరణంలో శారీరక శ్రమ వల్ల శరీర ఉష్ణోగ్రత ఆ మేరకు చేరుకున్నా ఎండదెబ్బకు గురవడం సహజం. ఈ రెండు సందర్భాలను వివరంగా చెప్పుకోవాలంటే....

వేడి వాతావరణానికి బహిర్గతం కావడం: ఎక్కువ సమయంపాటు ఎండలో గడపడం వల్ల శరీర కేంద్ర ఉష్ణోగ్రత (కోర్‌ టెంపరేచర్‌) పెరుగుతుంది. ఇలాంటి స్థితి వేడిగా, తేమగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయంపాటు గడపడం వల్ల సంభవిస్తుంది.

శారీరక శ్రమ: వేడి వాతావరణంలో అత్యధిక శారరీక శ్రమకు గురయినా శరీర కేంద్ర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి ఎండదెబ్బకు గురవుతాం. ఆ స్థితిలో అయోమయం, స్పృహ కోల్పోవడం, వాంతులు, ఒళ్లు వేడిగా మారడం, శ్వాస, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు

ఎలాంటి ఎండదెబ్బకు గురయినా అందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి ఏవంటే....

గాలి ధారాళంగా చొరబడని దుస్తులు, చమటను పీల్చుకునే వీలు లేని దుస్తులు ధరించడం. వేడిని గ్రహించే వీలున్న నల్ల దుస్తులు ధరించడం.

మద్యం తీసుకోవడం. మద్యం తాగడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే శక్తి శరీరం కోల్పోతుంది.

స్వేదం ద్వారా శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోవడం.

నివారణ తేలికే!

ఎండదెబ్బకు గురయి బాధ పడేకంటే, ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు. వేసవి వేడి, ఎండల ప్రభావానికి గురవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలిజ

దుస్తులు: ధరించే దుస్తులు తేలికగా, గాలి చొరబడేలా, చమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంతవరకూ తెల్లని దుస్తులే ధరించాలి.

సూర్యరశ్మి: సూర్యరశ్మి నేరుగా సోకితే, శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్‌స్ర్కీన్‌ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది.

దాహం వేసేవరకూ ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతోపాటు కొబ్బరినీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతూ ఉండాలి. ఇలా ఒంట్లో నీటి పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయాల్లో నీడ పట్టున గడపాలి. వ్యాయామానికి ఎండ లేని సమయాలను కేటాయించాలి.

దాహం తీరట్లేదా?

ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఏం చేయాలో అర్థం కాదు. వేసవిలో కొందరి పరిస్థితి ఇది. ఇలా మీకూ అనిపిస్తూ ఉంటే, గ్లాసుడు నీళ్లలో ఒక స్పూను తేనె కలుపుకుని తాగి చూడండి. ఆ తర్వాత తాగే నీళ్లతో మీ దాహం తీరడం ఖాయం. అన్నట్టు, చల్ల నీళ్లతో దాహం తీరదు. ఫ్రిజ్‌లో నుంచి గడ్డకట్టిన నీళ్ల బాటిల్‌ తీసి తాగటం వృథా! అతి చల్లని నీళ్లు జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆలోగా ఒంట్లోని ప్రతి కణం దాహార్తితో అల్లాడిపోతుంది. కాబట్టి జీర్ణాశయం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా గోరు వెచ్చని నీళ్లు తాగితే దాహం తీరుతుంది.

చెమట పొక్కులకు చక్కని చిట్కాలు

వేసవిలో చెమటను భరించటమే కష్టం. దీనికి చెమట పొక్కులు తోడైతే ఇక ఆ చిరాకును మాటల్లో చెప్పలేం. ఈ చెమట పొక్కులు మంట పెట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

మెత్తగా పొడి చేసిన ఓట్లను చల్లని నీళ్లతో నింపిన స్నానాలతొట్టిలో వేసి కలపాలి. నీళ్లు పాల రంగులోకి మారాక స్నానాలతొట్టిలో 30 నిమిషాలు సేదతీరాలి. తర్వాత మెత్తని టవల్‌తో తడి అదుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చెమట పొక్కులు వదులుతాయి.

వస్త్రంలో ముంచు ముక్కలు మూటగట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే 3 రోజులకి చెమట పొక్కులు మరింత పాకకుండా తగ్గిపోతాయి.

గంథం పొడి, గులాబీనీరు సమపాళ్లలో కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో పూయాలి. పూర్తిగా ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

ఒక కప్పు చల్లని నీళ్లలో ఒక టీస్పూను బేకింగ్‌ సోడా కలిపి, ఆ నీళ్లలో పలుచని వస్త్రం నానబెట్టి పిండేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద 10 నిమిషాలు ఉంచినా ఉపశమనం కలుగుతుంది.

ముల్తాని మట్టికి రోజ్‌వాటర్‌ చేర్చి ముద్దలా చేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద పూసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి పూసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

Updated Date - Apr 30 , 2024 | 12:13 AM