Share News

Pomegranate: మెదడు ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మ గురించి తెలుసుకుందాం..!!

ABN , Publish Date - Jan 02 , 2024 | 12:37 PM

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శీరీరాన్ని రక్షిస్తాయి.పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్న దానిమ్మలో గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మూత్ర విసర్జన ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యం కూడా దానిమ్మకు ఉంది.

Pomegranate: మెదడు ఆరోగ్యాన్ని పెంచే దానిమ్మ గురించి తెలుసుకుందాం..!!
Pomegranate

దానిమ్మను చిన్నా, పెద్దా అంతా తినడానికి ఇష్టపడతారు. ఆకర్షీయమైన చిన్న గింజలతో ఎర్రగా ఉండే దానిమ్మను తినడానికి, జ్యూస్ రూపంలో తీసుకోడానికి కూడా ఇష్టపడతారు. ఈ దానిమ్మలో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలున్నాయి. విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. మెదడు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

దానిమ్మపండు శక్తివంతమైన ఎర్రని రంగుతో ఉంటుంది. ఇందులోని ఆరిల్స్ అని పిలిచే విత్తనాలుంటాయి. దానిమ్మలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. దీనిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి నివారిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్న దానిమ్మలో గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మూత్ర విసర్జన ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యం కూడా దానిమ్మకు ఉంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళను ఏర్పడకుండా నివారిస్తుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. మెదడును రక్షించే ఎల్లాగిటానిన్ దానిమ్మలో ఉంటుంది. ఇది జీవక్రియకు సపోర్ట్ గా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: ఉసిరిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే కలిగే 5 ప్రయోజల గురించి తెలుసా..!!


1. దానిమ్మ పండులో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్ అధిక మొత్తంలో ఉన్నాయి.

2. దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలోనూ, మెదడు ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరిస్తాయి.

3. ఈ పండులోని ఎల్లాగిటానిన్స్, యాంటీఆక్సిడెంట్, గట్ మైక్రోబయోటా జీవక్రయలతో అల్డీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా న్యూరోప్రోటెక్టివ్‌గా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

4. మెగ్నీషియం కండరాల సడలింపు, నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహయపడుతుంది. దానిమ్మలో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు సహకరిస్తుంది.

5. దానిమ్మ పండు మానసిక ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 02 , 2024 | 12:41 PM