Share News

Refrigerator Maintenance : కూరలు, పండ్లు ఉంచే ఫ్రిజ్ ఎక్కువ కాలం పాటు పనిచేయాలంటే.. !

ABN , Publish Date - May 15 , 2024 | 03:47 PM

ఫ్రిజ్ వెనుక భాగంలో లేదా కింద కండెన్సర్ కాయిల్స్ ఉంటాయి. ఇవి దుమ్ము, చెత్తతో కప్పేసి ఉంటాయి. ఇది ఇలా దుమ్ముపట్టి ఉంటే చల్లబడే విధానం తగ్గిపోతుంది. వాక్యూమ్ క్లీనర్,లేదా బ్రష్ సహాయంతో ఆరునెల్లకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి.

Refrigerator Maintenance : కూరలు, పండ్లు ఉంచే ఫ్రిజ్ ఎక్కువ కాలం పాటు పనిచేయాలంటే.. !
refrigerator

కూరగాయలు, పాలు, పండ్లు అలా ఏదైనా కొన్నాకా కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే దానికి ఫ్రిజ్ నే ఉపయోగిస్తాం. ఏ వస్తువు చెడిపోకుండా ఫ్రిజ్ లో భద్రపరుస్తాం. కానీ రిఫ్రిజిరేటర్ కొంతకాలం పాటు చెడిపోకుండా మన్నాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. రిఫ్రిజిరేటర్లు మన ఇళ్లల్లో అవసరమైన వస్తువుగా మారిపోయింది. ఆహారాన్ని, ఆహార పదార్థాలను తాజాగా ఉంచడంలో ముఖ్యంగా పనిచేస్తాయి. దీనికాల పరిమితి మరింత పెంచి, మరికొంతకాలం ఉపయోగించేలా చూడాలంటే ఏంచేయాలో చూద్దాం.

వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడం అంటే తక్కువ వాడటం అనికాదు. కొన్ని వస్తువులకు కొంతకాలమే మన్నిక అని మనలో చాలా మందికి తెలుసు వాటిని భద్రంగా చూసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని మనకు తెలీకుండా పాడైపోతుంటాయి. ఫ్రిజ్ విషయంలో మనకు తెలిసింది తక్కువే. మన్నిక విషయానికి వస్తే చాలా విధాలుగా ఫ్రిజ్ మనకు ఉపయోగపడుతున్నా.. పెద్దగా దాని గురించి మనెవరికీ తెలీదు. ఎలా నిర్వహిస్తే.. ఫ్రిజ్ మరింత కాలం మన్నుతుందనే విషయం మనలో చాలా మందికి తెలీని విషయం..

జుట్టు, గోళ్లు పెరుగుదలకు బయోటిన్ ఎంత వరకూ అవసరం..!


కాయిల్స్ శుభ్రంగా ఉంచాలి.

ఫ్రిజ్ వెనుక భాగంలో లేదా కింద కండెన్సర్ కాయిల్స్ ఉంటాయి. ఇవి దుమ్ము, చెత్తతో కప్పేసి ఉంటాయి. ఇది ఇలా దుమ్ముపట్టి ఉంటే చల్లబడే విధానం తగ్గిపోతుంది. వాక్యూమ్ క్లీనర్,లేదా బ్రష్ సహాయంతో ఆరునెల్లకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి.

డోర్ సీల్స్..

డోర్ సీల్స్ లేదా రబ్బరు పట్టీలు, చల్లని గాలి ఫ్రిజ్ లో నుంచి బయటకు పోతుంది. దీనికి కొంత టైం పెట్టుకుని ప్రతిసారీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బేకింగ్ సోజా, నీటిలో కలిపి శుభ్రం చేయాలి. పాడైన వాటిని మళ్ళీ వేయించడం మంచిది.

Health Tips : స్మూతీస్లో అరటిపండు ఉపయోగించకపోవడానికి కారణాలేంటి..


సరైన ఉష్ణోగ్రత..

ఫ్రిజ్ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడం శక్తి సామర్థ్యానికి అవసరం. రిఫ్రిజరేటర్ కంపార్టమెంట్ అనువైన ఉష్ణోగ్రత 37 డిగ్రీల దగ్గర ఉంచాలి. కాబట్టి ఉష్ణోగ్రతను చాలా తక్కువగా సెట్ చేయడం మానుకోవాలి.

రిఫ్రిజిరేటర్ ఓవర్ లోడ్ చేయద్దు..

ఓవర్ లోడ్ చేయడం వల్ల చల్లదనం అన్ని వస్తువులకు తగిలే విధంగా ఖాళీలను ఉంచాలి.

ఫ్రీజర్ ను క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయాలి..

రిఫ్రిజిరేటర్ ఆలోమేటిక్ డీఫ్రాస్ట్ ఫంక్షన్ లేకపోతే ఫ్రీజర్ ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేయడం ముఖ్యం ఇలా ఉండకపోతే ఫ్రిజ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. శక్తి వినియోగాన్ని పెంచుతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 15 , 2024 | 03:47 PM