Share News

Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే జపనీస్ వ్యాయామాలు ఇవే.. ఓసారి ట్రైచేసి చూడండి..!

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:39 PM

జపనీస్ వ్యాయమ విధానంలో మొత్తం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకునేందుకు ఉన్న వ్యాయామాల గురించి తెలుసుకుందాం. సమతుల్య ఆహారం, వ్యాయామం కలిపి ఉండాలి.

Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే జపనీస్ వ్యాయామాలు ఇవే.. ఓసారి ట్రైచేసి చూడండి..!
Japanese Workouts

జపనీస్ వ్యాయమ విధానంలో మొత్తం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకునేందుకు ఉన్న వ్యాయామాల గురించి తెలుసుకుందాం. సమతుల్య ఆహారం, వ్యాయామం కలిపి ఉండాలి. ఆపైన చేసే వ్యాయామాలు శరీరానికి శక్తిని, ఫిట్ నెస్‌ని ఇస్తాయి.

టాబాటా శిక్షణ..

జపాన్ వారి టాబాటా అని పిలిచే హై - ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ టెక్నిక్‌ని చేయడం వల్ల కొవ్వు తగ్గించడంలో ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పొట్టభాగంలో ఈ టెక్నిక్ పనిచేస్తుంది.

మార్షల్ ఆర్ట్స్..

జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో కెండో, జూడో, కరాటే ఉన్నాయి. ఇవి శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచడంతో పాటు మొత్తం శరీర బలాన్ని పెంచడంలో కొవ్వు తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలను పెంచే స్కాల్ప్ మసాజర్లు ఇవే.. వీటితో ఒత్తైన జుట్టు ఖాయం.. !!


రేడియో టైపో..

జపాన్‌లో ఒక సాధారణ వ్యాయామం, రేడియో టైసో కాలిస్టెనిక్స్ , ఇందులో మొత్తం శరీర, రిథమిక్ కదలికలుంటాయి, ఇది కోర్ కండరాలకు పని చేస్తుంది. దీనితో కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.

హులా హూప్ వ్యాయామం..

పిల్లల కోసం హులా హూపింగ్ ఒక ఆహ్లాదరకమైన ఆట లాంటిది. ఇది బరువు తగ్గేందుకు, పొత్తికడుపు కండరాలు కదిలేందుకు ఉపయోగ పడుతుంది. కేలరీలను బర్న్ చేయడంలో పొత్తికడుపును టోన్ తేయడంలో సహాయపడుతుంది.

ఐసోమెట్రిక్ వ్యాయామాలు

ప్లాంక్స్, స్టాటిక్ లెగ్ లిఫ్ట్‌లు జపనీస్ ఫిట్‌నెస్ నియమావళిలో కనిపించే రెండు సాధారణ ఐసోమెట్రిక్ వ్యాయామాలు ఇవి. పొట్ట కండరాలను సాగదీసి, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహకరిస్తాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 03 , 2024 | 02:39 PM