Share News

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా వదిలించుకోవాలి. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం ఉందా?

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:37 AM

కొవ్వు కాలేయంలో రెండు రకాలుంటాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండోది ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయం. ఇది సరైన జీవనశైలి లేకపోవడం, తినడం, తాగడంలో అజాగ్రత్తల కారణంగా వచ్చే అవకాశం ఉంది.

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా వదిలించుకోవాలి. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం ఉందా?
Health Benefits

శరీరంలో ఏ భాగానికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా వైద్యుల వద్దకు పరుగెత్తుతాం. అలాంటి ఒక సమస్య వస్తుందనే ఆలోచన కూడా లేకుండా ఉన్న సమయంలో శరీరంలో పెద్ద వ్యాధి ఉందనే విషయాన్ని జీర్ణం చేసుకోవడమే కష్టంగా మరుతుంది. అందుకే వీలైనంత ఆరోగ్యంగా ఉంటూ ఉండాలి. సరైన వ్యాయామం, ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ కూడా అంతే అవసరం. శరీరంలో ముఖ్యమైన భాగం అయిన కాలేయం, దీని చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఫ్ల్యాటీ లివర్ వ్యాధిగా మారుతుంది. దీనిని ఆయుర్వేదంలో సులభంగా తగ్గించవచ్చు. అదెలాగంటే..

కొవ్వు కాలేయంలో రెండు రకాలుంటాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండోది ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయం. ఇది సరైన జీవనశైలి లేకపోవడం, తినడం, తాగడంలో అజాగ్రత్తల కారణంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ ఒక పెద్ద వ్యాధిగా వ్యాపిస్తోంది. సాధారంగా లెక్కవేస్తే ప్రతి పదిమందిలో 6 నుంచి 7 మందికి కొవ్వు కాలేయం సమస్య ఉండవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ ను నిర్లష్యం చేయడం వల్ల ప్రమాదకరం కావచ్చు. దీనికి ఏం చేయాలంటే..

Health Benefits: కాల్షియం, విటమిన్ డి క్యాప్సూల్స్ వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

శరీరంలో ఉండే కొవ్వు ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది LDL లిపోట్రీన్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెకు సంబంధించిన వ్యాధులు వేగంగా పెరుగుతాయి.

ఫ్యాటీ లివర్.. లక్షణాలు.

కొవ్వు కాలేయం కడుపు కుడి భాగంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఇది ఉండటం వల్ల బరువు తగ్గుతారు. బలహీనంగా కనిపిస్తారు. కళ్లు, చర్మం పసుపుగా ఉంటాయి. ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. ఎసిడిటీ, పొట్ట వాపు, ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రధాన సంకేతాలు.


Overall Health : ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!

కాలేయ రుగ్మతకు నేల ఉసిరితో చెక్

భూమి ఆమ్లా లేదా నేల ఉసిరి అని పిలిచే ఈ చిన్ని మొక్కతో కలేయానికి సోకిన వ్యాధిని తగ్గించవచ్చని ఆయుర్వేదం చెబుతుంది. దీనికి నేల ఉసిరిని బాగా నూరి ఉండలుగా చేసి గాలికి ఆరనివ్వాలి. వీటిని మాత్రలుగా చేసుకుని రోజూ రాత్రి సమయంలో తీసుకుంటూ ఉండాలి. దీనితో కొవ్వు కాలేయం సమస్య చాలా వరకూ తగ్గుతుంది. విటమిన్ సి అధికంగా ఉన్న నేల ఉసిరిలో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. తేలికగా జీర్ణం అయ్యేట్టుగా చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కాలేయ వ్యాధులకు మంచి ఔషధంగా పని చేస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 11 , 2024 | 11:37 AM