Share News

Mango In Summer : షుగర్ వ్యాధి ఉంటే రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలి..!!

ABN , Publish Date - May 24 , 2024 | 03:11 PM

మామిడి పండ్లు వేసవిలో చాలామంది తినే పండ్లు. అద్భతమైన వీటి రుచి,తీపి ఈ కారణంగా అంతా ఇష్టంగా తింటారు. మామిడి పండులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఇందులోని బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Mango In Summer : షుగర్ వ్యాధి ఉంటే రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలి..!!
mango juice

వేసవిలో వచ్చే మామిడి పండ్లంటే ఇష్టపడనివారంటూ ఉంటారా.. చిన్నా, పెద్దా అందరికీ మామిడిపండ్లు చాలా ఇష్టం. మంచి ఎండల్లో నోటికి తీయదనాన్ని ఇచ్చే మామిడి పండ్లను రుచి చూడకుండా ఉండలేరు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదని చెబుతుంటారు. తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయనే మాటకు చాలా వరకూ మామిడి పండ్లను తినడం మానకుంటారు అసలు షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడిపండ్లను తినకూడదా.. తింటే రోజులో ఎన్ని తినచ్చు.. ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లు వేసవిలో చాలామంది తినే పండ్లు. అద్భతమైన వీటి రుచి,తీపి ఈ కారణంగా అంతా ఇష్టంగా తింటారు. మామిడి పండులో అద్భుతమైన పోషకాలున్నాయి. ఇందులోని బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మామిడి పండు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు, కళ్ళు, జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటాయి. కానీ బరువు, షుగర్ స్థాయి చాలా వరకూ పెరగికుండా ఉండాలంటే..

మామిడిపండులో పోషకాల లిస్ట్..

విటమిన్ ఎ, బి6, బి12, సి, ఇ, విటమిన్ కె, విటమిన్ డి ఉన్నాయి. ఇంకా ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, ఐరెన్, చక్కెర, ప్రోటీన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్, నియాసిన్, థయామిన్ మంచి ఆరోగ్యానికి సహకరిస్తాయి.

1. రక్తపోటు అదుపులో ఉంటుంది.

2. కండరాలు బలపడతాయి.

3. శరీరంలోని యాసిడ్ ను తొలగించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Weight Loss : ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంలేదా.. ఇలా చేసి చూడండి..!


4. కిడ్నీలకు మేలు చేస్తాయి మామిడిపండ్లు.

5. మామిడిపండ్లలోని అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, రక్తంలో చక్కెరను పెంచుతుంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారిని తినవద్దని అనేది.

6. మామిడిపండ్లు బరువును పెంచుతాయి. పాలతో తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది.

రోజుకి 5 నుంచి 6 మామిడి పండ్లు..

మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక మామిడి పండును మాత్రమే తినాలి. 100 గ్రాముల మామిడి కాయలో దాదాపు 60 కేలరీలు ఉంటాయి. ఒక మామిడి పండులో దాదాపు 202 కేలరీలుంటాయి.

ఏ సమయంలో తింటే బెటర్..

అల్పాహారంలో మామిడి పండు తినడం వల్ల బ్లడ్ షుగర్, బరువు పెరుగకుండా ఉంటారు. నిద్రపోయే ముందు మామిడి రసం తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 24 , 2024 | 03:39 PM