Share News

Chickpeas: పచ్చి శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా... వీటిని తీసుకుంటే ఎముక ఆరోగ్యానికి ఢోకాలేదు ..!

ABN , Publish Date - Jan 16 , 2024 | 12:01 PM

గ్రీన్ శనగలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కాస్త తీయగా, కమ్మని రుచితో ఉంటాయి. గ్రీన్ శనగలు చోలియాగా పిలుస్తారు.

Chickpeas: పచ్చి శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా... వీటిని తీసుకుంటే ఎముక ఆరోగ్యానికి ఢోకాలేదు ..!
Green Chana

హిందీలో ఈ పచ్చి శనగల్ని చోలియా అని పిలుస్తారు. గ్రీన్ చనా లేదా చిక్ పీస్ అనే పేర్లతో భారతదేశం అంతటా పిలుస్తారు. ఈ చిక్కుళ్ళు పప్పుదినుసులు శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఈ శనగలు శీతాకాలంలో ఎక్కవగా పండుతాయి. దీనితో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ శనగలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి కాస్త తీయగా, కమ్మని రుచితో ఉంటాయి. గ్రీన్ శనగలు చోలియాగా పిలుస్తారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా శీతాకాలం అంతా దొరుకుతాయి. పచ్చి శనగలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటిని కర్రీలలో, బిర్యానీ ఇలా ఎక్కువగా ఉపయోగిస్తారు.

1. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. గ్రీన్ శనగల్లోని ఫైబర్ ప్రేగులకు మైక్రోబయోమ్‌కు ఇవ్వడం ద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. పచ్చి శనగల్లో ప్రోటీన్లు ఎక్కువ..

2. కండరాల గట్టిదనానికి, రోగనిరోధక పనితీరు, మొత్తం సెల్యులార్ ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం.

3. ఎముక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఇది కూడా చదవండి: బలమైన ఎముకలు ఆరోగ్యానికి ఈ వ్యాయామాలు ప్రయత్నించండి..!

4. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. అందుకే ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది.

5. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పచ్చి శనగలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయి.


6. ఒత్తిడిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

7. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు అవసరమైన విటమిన్ల కలయికతో గ్రీన్ శనగలు అలసటను ఎదుర్కోవడానికి సహకరిస్తాయి.

8. రోజుంతా ఉత్సాహంగా ఉండేందుకే కాదు, బరువు తగ్గేందుకు కూడా సపోర్ట్ చేస్తాయి.

అరకప్పు పచ్చి శనగల్లో దాదాపు 364 కేలరీలు, 19.3 గ్రాముల ప్రొటీన్లు, 17.6 గ్రాముల డైటరీ ఫైబర్, 6 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల సహజ చక్కెర ఉన్నాయి. ఈ పోషకాహారాన్ని అటువంటి ఇతర గింజలతో పోల్చినట్లయితే, గ్రీన్ చిక్‌పీస్‌లో అన్ని గుణాలు ఉన్నందున వాటిని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తున్నారు.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 16 , 2024 | 12:02 PM