శరీరం గట్టిగా..
ABN , Publish Date - May 01 , 2024 | 01:23 AM
ఎండాకాలం అనగానే పుచ్చకాయలు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలు ఉన్నాయి. శరీరానికి చల్లదనం కూడా చేకూర్చే ఈ సమ్మర్ ఫ్రూట్ ఉపయోగాలివే..
ఎండాకాలం అనగానే పుచ్చకాయలు గుర్తొస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పుచ్చకాయలు ఉన్నాయి.
శరీరానికి చల్లదనం కూడా చేకూర్చే ఈ సమ్మర్ ఫ్రూట్
ఉపయోగాలివే..
వాటర్‌మెలన్‌లో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుతుంది.
ఇందులో ఫైబర్ ఉండటం వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. దీంతో పాటు బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ పండును మెనూలో ఉంచుకోవాల్సిందే.
విటమిన్- సి పుష్కలం. దీనివల్ల చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఎ- విటమిన్ ఉండటం వల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. పొటాషియం ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. త్వరగా నీరసం రాదు. గుండె ఆరోగ్యానికి మంచిది.
రక్తంలోని చక్కెరశాతం పెరగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో వడదెబ్బ బారిన నుంచి పుచ్చకాయ పండు రక్షిస్తుంది.
మలబద్ధకంతో బాధపడేవాళ్లు, మూత్రం మంటగా వస్తున్నప్పుడు.. ఈ పుచ్చకాయ పండు లేదా రసం తాగితే ఉపశమనం లభిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది.