Share News

Food: ఈ వంటకాన్ని అక్కడ ఎందుకు నిషేదించారో తెలుసా..!

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:09 PM

ప్రధానంగా ఓ వంటకాన్ని నిషేదించారంటే దానికి ఆరోగ్యకరమైన విషయాలే ప్రధాన కారణంగా ఉంటాయి

Food: ఈ వంటకాన్ని అక్కడ ఎందుకు నిషేదించారో తెలుసా..!
gobi manchurian

కాస్త వాన పడినా వేడి వేడిగా బజ్జీనో, పకోడినో, లేదా వేడి వేడి గోబీ మంచూరియన్ తినాలని చూస్తాం. వాటిని సాయంత్రాలు చల్లని వాతావరణంలోనే తిని ఆస్వాదించాలి కానీ.. వేళకాని వేళ తినాలన్నా సెట్ కాదు. అలాంటి గోబీ మంచూరియన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం.. ఆహార ప్రియులు గోబీ మంచూరియన్‌ను అమితంగా ఇష్టపడతారు, ఇది సాధారణంగా కాలీఫ్లవర్ పువ్వులతో స్పైసీ రెడ్ సాస్‌లో పూయడంతో తయారైన ఫ్యూజన్ డిష్. అయినప్పటికీ గోవా నగరమైన మపుసా, ఈ వంటకాన్ని నిషేదించింది. దీనికి కారణం ఏంటనేది తెలుసుకుందాం.

గోబీ మంచూరియన్ వంటకాన్ని గోవా ప్రాంతంలో నిషేదించడానికి గల కారణాల్లో ముఖ్యమైనది. అందులో వాడే కృత్రిమ రంగులు, పరిశుభ్రత గురించి ఆందోళనల కారణంగా బూత్‌లు, విందుల నుండి ఈ వంటకాన్ని నిషేధించారు. చాలా మందికి ఇష్టమైన గోబీ మంచూరియన్‌ను నిషేధించడానికి మరొక విచిత్రమైన కారణం ఏమిటంటే, నకిలీ సాస్‌లు, వాషింగ్ పౌడర్‌లను పదార్థాలుగా ఉపయోగించడం కూడా దీనిని నిషేదించేందుకు కారణంగా నిలిచింది.

ప్రధానంగా ఓ వంటకాన్ని నిషేదించారంటే దానికి ఆరోగ్యకరమైన విషయాలే ప్రధాన కారణంగా ఉంటాయి, అలా గోబీ మంచూరియా గోవా ప్రాంతంలో నిషేదించడానికి కారణమైంది. ఎక్కడో నకిలీ విధానంలో తయారైన సాస్ లను ఉపయోగించి తయారు చేస్తున్న ఈ వంటకం తిని ప్రజలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గోబీ మంచూరియన్ తయారీకి సింథటిక్ రంగులను ఉపయోగిస్తారనే కారణాన్నే ప్రధానంగా చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారని MMC చైర్ పర్సన్ ప్రియా మిషాల్ తెలిపారు.


ఇది కూడా చదవండి: మెరుగైన మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 4000 అడుగులకు తక్కువ వేసినా చాలట..!

మపుసా మున్సిపల్ కౌన్సిల్‌తో పాటు ఇతర గోవా పౌర సంస్థలు గోబీ మంచూరియన్‌పై యుద్ధం ప్రకటించాయి. 2022లో శ్రీ దామోదర్ ఆలయంలో జరిగే వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా గోబీ మంచూరియన్ విక్రయించే స్టాళ్ల సంఖ్యను పరిమితం చేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌కు సూచించింది. ఈ ఆర్డర్‌ను తగ్గించడానికి ఎఫ్‌డిఎ ఈ రకమైన స్టాళ్లను కంట్రోల్ చేసింది.

నెల్సన్ వాంగ్ మంచూరియన్ ..

అతనే మొదటిసారిగా గోబీ మంచూరియాను తయారుచేసాడని చెబుతారు. అదీ 1975లో ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ వంటకాన్ని తయారు చేసాడు. గరం మసాలా, అల్లం, పచ్చి మిరపకాయ వంటి కొన్ని భారతీయ దేశీ మసాలాలను ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఆ తర్వాత ఇందులో సోయా సాస్ కూడా ఉంటుంది. ఈ వంటకం హైలైట్ మొక్కజొన్న పిండితో వేయించిన పొరతో గోబీతో చేసిన బంతులు. ఇలాగే చికెన్ మంచూరియన్‌ను కూడా తయారు చేస్తారు. దీనికి కూడా మంచి ఆదరణే ఉంది.

Updated Date - Feb 05 , 2024 | 02:09 PM