Share News

Health : బరువు పెరగడానికి, ఇతర సమస్యలకు ప్రాసెస్ చేసిన ఆహారాలే కారణమా..?

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:12 PM

జ్యూస్‌లు, కోలాలు, చాక్లెట్‌లు, కేకులు, తృణధాన్యాలు, జామ్‌లు, కెచప్, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాల రూపంలో ఉన్న షుగర్ ను తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Health : బరువు పెరగడానికి, ఇతర సమస్యలకు ప్రాసెస్ చేసిన ఆహారాలే కారణమా..?
Suagar

మోతాదుకు మించి చక్కెర వినియోగించడం అంటే ఇప్పటి రోజుల్లో అంతా అన్నాన్ని తగ్గించి తృణధాన్యాల మీదకు మళ్ళుతున్నారు. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి.. ప్యాకింగ్ ఆహారాలు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా, కోలాలు, చాక్లెట్‌లు, కేకులు, జామ్‌లు, కెచప్, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాల రూపంలో ఉన్న షుగర్ ను తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదే ఇంట్లో తయారుచేసిన ఆహారంలో ఉండే చక్కెరను కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. చక్కెర వినియోగంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటంటే..

తక్కువ మోతాదులో చక్కెరను తినాలని చూసేవారు కొన్ని ఆహార పదార్థాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ముఖ్యంగా.. ఐస్ క్రీమ్‌లు, పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారాలలో చక్కెరను ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యంపో ప్రభావాన్ని చూపుతాయి. సహజంగా లభించే చక్కెరలు అంటే... పండ్లు లేదా పాల ఉత్పత్తులు వంటివి తీసుకుంటే.. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. చాలా మంది చక్కెరను పూర్తిగా తగ్గించాలని చెబుతుంటారు. సహజ పదార్థాలతో చక్కెర స్థాయిలను పరిమితం చేసుకోవచ్చు.

మొక్కల ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు.. వీటిలో ముఖ్యంగా..


ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అల్జీమర్స్ లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం.. పరిమితమైన పరిమాణంలో చక్కెరను తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదని తేలింది. సుక్రోలోజ్, ఇతర చక్కెర ప్రత్యామ్నాయాల వినియోగం బరువు తగ్గడానికి బదులుగా.. బరువు పెరుగుతుందని నిరూపితమైంది. ఇవి అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

ఈ మృదువైన, కొబ్బరి మలై తింటే ఎన్ని బెనిఫిట్స్ అంటే.. మీరు అస్సలు ఊహించరు..!

అధిక చక్కెర తీసుకోవడం వల్ల న్యూరోకెమికల్ ప్రభావాలు పెరుగుతాయి. చక్కెర వినియోగం మెదడును ఆనందం, బహుమతి భావాలతో ప్రేరేపిస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 15 , 2024 | 06:29 PM