Share News

Summer Drink : వేసవి వేడి నుంచి రిలీఫ్.. పుదీనా నీటిని తీసుకుంటే రిఫ్రెష్ డ్రింక్ లానే కాదు దీనితో.. !

ABN , Publish Date - May 06 , 2024 | 05:36 PM

శరీరం సరిగా పని చేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. తేనెతో కలిపి ఈ నీటిని తీసుకున్నా రుచిగా ఉంటుంది. శారీరక పనితీరును మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇది ముఖ్యం.

Summer Drink : వేసవి వేడి నుంచి రిలీఫ్..  పుదీనా నీటిని తీసుకుంటే రిఫ్రెష్ డ్రింక్ లానే కాదు దీనితో.. !
Summer Drink

వేసవిలో ఎండ వేడికి చల్లగా ఏదైనా తాగేస్తూ ఉంటాం. ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకుంటే శరీరానికి వేడి తగ్గించేందుకు పుదీనా నీరు చక్కగా పనిచేస్తుంది. కొబ్బరి నీటికంటే కూడా చాలా చవకగా దీనిని తయారు చేసుకుని తీసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో దీనిని తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్ గా ఉపయోగపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ చక్కెర మొత్తంతో ఉంటుంది.కనుక పుదీనా వాటర్ మంచి ఆరోగ్యపానీయంగా తాజాగా ఉంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎండాకాలం అందే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

పుదీనా నీరు..

పుదీనా లేదా మింట్ పేరు ఏదైనా ఎలా పిలిచినా ఈ ఆకులతో శరీరానికి ఎండల్లో మేలు జరుగుతుంది. మంచి సువాసనతో, రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది.

పుదీనా వాటర్ వల్ల బెనిఫిట్స్..

జీర్ణక్రియ మెరుగవుతుంది.

జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారు పుదీనా నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

హార్మోన్ల అసమతుల్యత..

పుదీనా నీటిని తాగడం వల్ల టెల్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడం, హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడం చేస్తుంది. పుదీనాతో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ చికిత్సకు సహాయపడుతుంది.


Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!

హైడ్రేట్ గా ఉంచుతుంది.

శరీరం సరిగా పని చేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. తేనెతో కలిపి ఈ నీటిని తీసుకున్నా రుచిగా ఉంటుంది. శారీరక పనితీరును మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇది ముఖ్యం.

ఒత్తిడిని దూరం చేస్తుంది.

పుదీనా నీరు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించడానికి, ప్రశాంతంగా ఉండేందుకు పుదీనా సహకరిస్తుంది.

Diabetes Tips : మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఏంటో తెలుసా.. !

బరువు తగ్గేందుకు కూడా..

పుదీనా నీటిని పరగడుపునే తీసుకోవడం వల్ల కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పుదీనా అనేది విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడే పోషకాలున్నాయి. శరీరంలోకి ప్రవేశించే హాని కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి..

పుదీనా ఆకులలో సాలిసిలిక్ యాసిడ్ , విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపును ఇస్తాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 06 , 2024 | 05:38 PM