Share News

Milk with makhana : ఎముకలు, దంతాలు బలపడాలంటే మిల్క్ & మఖానా కలిపి తీసుకుంటే సరిపోతుందా..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:32 PM

వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పాలతో మఖానా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఈ రెండింటినీ బలోపేతం చేయడానకి కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పాలు, మఖానాలలో పుష్కలంగా ఉన్నాయి.

Milk with makhana : ఎముకలు, దంతాలు బలపడాలంటే మిల్క్ & మఖానా కలిపి తీసుకుంటే సరిపోతుందా..!
makhana

ఆరోగ్యం విషయంలో ప్రతిరోజూ ఏం తినాలా అనే ఆలోచనతో మొదలవుతుంది. డ్రై ప్రూట్స్ నుంచి ఆకుకూరలు, మాంసాహారం ఇలా ప్రతిదీ తీసుకునేందుకు సరైన ప్రణాళికను ఏర్పరుచుకుంటాం. శరీరానికి అవసరమైన పోషకాల విషయంలో మఖానా వంటి గింజులు ఇచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పాలు, మఖానా కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను తరిమి కొడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల..

విటమిన్స్..

ఒక గిన్నె మఖానాలో 10 గ్రాముల ప్రోటీన్ 15 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాలతో మఖానా తీసుకున్నప్పుడు శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి, బ12, సి అందుతాయి.

జీర్ణ సమస్యలు..

మఖానా, పాలు కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కడుపులో టాక్సిక్స్, బ్యాక్టీరియాను తొలగించడం, శరీరానికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గంచడంలో సహాయపడతాయి.

Banana Laves : రుచిని పెంచే అరటి ఆకుల భోజనంతో ఎన్ని లాభాలంటే.. !

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

మిల్క్, మఖానా ఆరోగ్య ప్రయోడనాలు ఏంటంటే.. కరోనరీ వ్యాధులను నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మఖానాలో ఆల్కలాయిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి గుండెను రక్షిస్తుంది. రక్తపోటు, హృదయస్పందనల రేటును నియంత్రించడంలో సహాయపడే మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గించే ఆహారంలో ఫిట్ నెస్ విధానంలో పాలు, మఖానా సహకరిస్తాయి. ఇందులో తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. మఖానాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతాయి. ఆకలిని తగ్గిస్తాయి.


ఎముకల ఆరోగ్యానికి..

వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనపడతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పాలతో మఖానా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఈ రెండింటినీ బలోపేతం చేయడానకి కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పాలు, మఖానాలలో పుష్కలంగా ఉన్నాయి. కీళ్లనొప్పులు, ఎముకల జబ్బులు ఉన్న వారికి మిల్క్ మఖానా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Cooking Tips : వంట సులభంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ చిట్కాలు పాటించండి..!

చర్మ ఆరోగ్యానికి..

మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏంజింగ్ గుణాలు ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్, విటమిన్ ఎ, డి, ఇ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

జుట్టు రాలడాన్ని..

జీవనశైలి అలవాట్ల కారణంగా జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మఖానాతో పాటు పాలను కలిపి తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 18 , 2024 | 07:30 PM