Share News

Banana Laves : రుచిని పెంచే అరటి ఆకుల భోజనంతో ఎన్ని లాభాలంటే.. !

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:44 PM

ఆరోగ్యకరమైన విధానంలో ఆలోచిస్తే అరటి ఆకులో తినడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. అరటి ఆకులలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పెంచేందుకు సహకరిస్తాయి.

Banana Laves : రుచిని పెంచే అరటి ఆకుల భోజనంతో ఎన్ని లాభాలంటే.. !
Banana Laves

అరటి ఆకులు ఆహారం తినేందుకు వీలుగా ఉంటాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క ఆకులను ఆహారం తినేందుకు, ఆహార పదార్థాలను ప్యాక్ చేసేందుకు వాడతారు. పశుగ్రాసానికి కూడా ఉపయోగిస్తారు. అరటి ఆకుల్లో తినడం కొన్ని సంస్కృతులలో ముఖ్యంగా దక్షిణాసియా,ఆగ్నేసియాలో ఈ ఆకుల్లో భోజనం చేయడం ఆచారంగా వస్తుంది. ఫ్లాస్టిక్ ఉపయోగించక పూర్వం నుంచి అరటి ఆకు భోజనం ఉంది. ఇప్పటి రోజుల్లో అరటి ఆకుల్లో భోజనం చేయడం ప్లాస్టిక్ నివారించేందుకు, అలాగే మంచి రుచిని ఇస్తుందని నమ్ముతారు. అసలు అరటి ఆకు భోజనంలో ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఏవంటే..

ఆరోగ్యకరమైన విధానంలో ఆలోచిస్తే అరటి ఆకులో తినడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. అరటి ఆకులలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పెంచేందుకు సహకరిస్తాయి. వేడి వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు కొన్ని పాలీఫెనాల్స్ ఆహారంలోకి బదిలీ అవుతాయి. అరటి ఆకును ప్లేట్‌గా ఉపయోగించడం వల్ల, రసాయనాలతో కూడిన డిస్పోజబుల్ అవసరాన్ని తగ్గించవచ్చు. ఇది పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఆకుల్లో భోజనం చేస్తే..

సహజ క్రిమి సంహారి..

అరటి ఆకుల్లో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలున్నాయి. ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తాయి. అరటి ఆకులో తింటే ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలు తగ్గుతాయి.

Cooking Tips : వంట సులభంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ చిట్కాలు పాటించండి..!

పోషకాలు..

అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలున్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని తీసుకోవడం వల్ల దానిలోని పోషకాలు బదిలీ అవుతాయి.

రుచిని పెంచుతుంది.

అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఆకులు భోజనం మొత్తానికి మంచి రుచిని అందిస్తుంది.


పర్యావరణ అనుకూలమైనది.

అరటి ఆకులను ఉపయోగించివపుడు ఇది ప్లాస్టిక్ ప్లేట్ అవసరాన్ని తగ్గిస్తుంది. కాలుష్యానికి చెక్ పెడుతుంది.

Skin : ఎండవేడిని తట్టుకుని స్కిన్ మెరవాలంటే.. ఇలా చేయండి.!

బయోడిగ్రేడబుల్..

అరటి ఆకులు Biodegradation చెందుతాయి. ఇవి పర్యావరణానికి హాని కలిగించకుండా సులభంగా మట్టిలో కలిసిపోతాయి.

అరటి ఆకు భోజనం..

అరటి ఆకులో భోజనం సంప్రదాయ శోభను తెస్తుంది. పండుగలకు, ఫంక్షన్లకు మంచి కళను తెస్తాయి.

జీర్ణశక్తిని పెంచుతాయి.

అరటి ఆకు ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియపై సానుకూల ప్రభావం చూపుతుంది. మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించేలా చేస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 18 , 2024 | 12:44 PM