Share News

Migraine: మెగ్నీషియం బాగా తీసుకుంటే మైగ్రైన్ తగ్గుతుందా? అసలు నిజాలివీ..

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:34 PM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక రకాల పోషకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అందుకే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్లు, విటమిన్ల మాదిరిగానే, శరీరానికి సరైన పరిమాణంలో సూక్ష్మపోషకాలు కూడా అవసరమని ఆహార నిపుణులు అంటున్నారు.

Migraine: మెగ్నీషియం బాగా తీసుకుంటే మైగ్రైన్ తగ్గుతుందా? అసలు నిజాలివీ..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక రకాల పోషకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అందుకే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్లు, విటమిన్ల మాదిరిగానే, శరీరానికి సరైన పరిమాణంలో సూక్ష్మపోషకాలు కూడా అవసరమని ఆహార నిపుణులు అంటున్నారు. ఇలాంటి సూక్ష్మపోషకాలలో మెగ్నీషియం ఒకటి. కండరాలు, నరాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా మైగ్రైన్ అటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. ఇదెంత వరకు నిజమో తెలుసుకుంటే..

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి. ఇది వికారం, వాంతులు, వెలుతురు చూడటం, శబ్దాలు విన్నప్పుడు భరించలేకపోవడం వంటి ఇతర సమస్యలతో కూడి ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మైగ్రేన్ అటాక్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.


మైగ్రేన్ నొప్పితో బాధపడేవారికి ఇతరులకన్నా మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించవచ్చని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణ మందులతో పోలిస్తే మైగ్రేన్ సమస్య ఉన్నప్పుడు ఒకగ్రాము మెగ్నీషియం తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మైగ్రేన్ సమస్య ఉన్నవారు మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అసలు సమస్య వచ్చే ప్రమాదమే ఉండదు.

డిప్రెషన్ కూ మందే..

మైగ్రేన్ దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది డిప్రెషన్ సమస్యకు దారితీస్తుంది. అందుకే డిప్రెషన్ ఉన్నవారు మెగ్నీషియం ఆహారాలను బాగా తీసుకుంటే డిప్రెషన్ సమస్యతో పాటూ, మైగ్రేన్ కూడా తగ్గుతుంది. మాంసాహారాల నుండి చిక్కుళ్లు, టోఫు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం వల్ల మెగ్నీషియం భర్తీ అవుతుంది.

Updated Date - Feb 11 , 2024 | 08:39 PM