Health Benefits: డార్క్ చాక్లెట్ తింటే మూడ్ చేంజ్ అవుతుందా....!
ABN , Publish Date - Feb 05 , 2024 | 05:02 PM
డార్క్ చాక్లెట్ తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటును తగ్గస్తుంది., గుండె సమస్యలను దరిచేరనీయదు. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
పిల్లలు, పెద్దలు అందరికీ చాక్లెట్ అంటే ఇష్టమే.. అయితే ఇందులో డార్క్ చాక్లెట్ రుచి వేరు. దీనిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అందులో ముఖ్యంగా.. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే డార్క్ చాక్లెట్‌లో ఫ్లెవనాయిడ్స్ పాలీ ఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహకరిస్తాయి.
గుండె ఆరోగ్యానికి కూడా..
డార్క్ చాక్లెట్ తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటును తగ్గస్తుంది., గుండె సమస్యలను దరిచేరనీయదు. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మూడ్ బూస్టర్..
డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఎండోర్ఫిన్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలున్నాయి. ఇవి మెదడులోని ఫీల్ గుడ్ హార్మోన్లను మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
మధుమేహం కోసం డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి, ఇవి టైప్-2 డయాబెటిస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయి.
రక్తపోటు విషయంలో డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనంగా, ఇది ఎపికాటెచిన్ సమ్మేళనాన్ని ఉంది, ఇది రక్తపోటును తగ్గించడంలో, ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో అధిక ఫ్లేవనాల్ కంటెంట్ ఉంటుంది.. మిల్క్ చాక్లెట్‌లో చాలా తక్కువగా ఉంటుంది. వైట్ చాక్లెట్‌లో ఏదీ ఉండదు. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాల ఇనుము, జింక్, మెగ్నీషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. చక్కెర తక్కువగా ఉంటుంది, దీని వలన ఒకదాని తర్వాత మరొకటి తినే అవకాశం తక్కువ. తక్కువ మొత్తంలో చక్కెరతో ఉన్న డార్క్ చాక్లెట్ 70-80% కోకో ఎంచుకోవాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)