Share News

Healthy Drink : ఉదయాన్నే కొబ్బరి నీరుతో, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. !

ABN , Publish Date - May 02 , 2024 | 04:21 PM

హైడ్రేషన్ బూస్ట్‌గా ఉండే కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్ పోషకాల మూలం. ముఖ్యంగా పొటాషియం ఉంటుంది. ఇది రాత్రిపూట కోల్పోయిన ద్రవాలను తిరిగి తీసుకువస్తుంది. అందుకే కొబ్బరినీరు ఉదయాన్నే తీసుకోవడం మంచిది.

Healthy Drink : ఉదయాన్నే కొబ్బరి నీరుతో, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. !
Health

ఎండలు పెరుగుతున్న సమయంలో చల్లగా ఉండే పానీయాల మీదకు పోతుంది మనసు. చల్లగా ఏదైనా తాగితే కానీ ప్రశాంతాంగా అనిపించడదు. ఈ ఎండల్లో రిఫ్రెష్ గా ఉంచే డ్రింక్స్ లో ఇది మాత్రం కాస్త స్ఫెషల్ అనే చెప్పాలి. ఈ ట్రెండీ డ్రింక్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అదే కొబ్బరి నీరులో నిమ్మకాయ కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునట. అదేలాగంటే..

హైడ్రేషన్ బూస్ట్‌గా ఉండే కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్ పోషకాల మూలం. ముఖ్యంగా పొటాషియం ఉంటుంది. ఇది రాత్రిపూట కోల్పోయిన ద్రవాలను తిరిగి తీసుకువస్తుంది. అందుకే కొబ్బరినీరు ఉదయాన్నే తీసుకోవడం మంచిది. దీనిలో నిమ్మకాయను కలపడం వల్ల అతిసారం, అధిక చెమట వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

1. మెరుగైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

2. కొబ్బరినీరుతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో పనిచేస్తుంది.

3. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కొబ్బరి నీళ్లను పరగడుపునే తీసుకుంటే ఇది రక్తపోటును అదుపుచేసి., గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Healthy Food : మల్బరీ ఫ్రూట్ తీసుకుంటే ఇన్ని లాభాలా..!

4. బ్లడ్ షుగర్ తగ్గుతుంది...

నిమ్మకాయ, కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధి ఉన్నవారికి సహకరిస్తుంది.

5. కిడ్నీస్టోన్స్..

కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గిస్తుంది.

6. ఆరోగ్యకరమైన చర్మం..

ఈ పానీయం ఉదయాన్నే తీసుకునే వారికి చర్మం నిగారింపుగా ఉంటుంది.

7. ఎసిడిటీ..

ఈ పానీయాన్ని ఉదయాన్నే తాగేవారిలో ఎసిడిటీ సమస్య ఉండదు.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 02 , 2024 | 04:22 PM