Share News

Health Benefits : ఈ వేసవిలో శరీరానికి అశ్వగంధ అందించే ప్రయోజనాలేంటి?

ABN , Publish Date - May 06 , 2024 | 01:18 PM

బైపోలార్ డిజార్డర్ ఉన్న వారిలో ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ 500mg అశ్వగంథను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.

Health Benefits : ఈ వేసవిలో శరీరానికి అశ్వగంధ అందించే ప్రయోజనాలేంటి?
Ashwagandha

అశ్వగంధ (Ashwagandha) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడి, మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే అశ్వగంధను ఉపయోగించి శక్తిని, యవ్వనాన్ని పెంచటానికి ఔషదాలను తయారు చేస్తారు. ఇదే కాదు.. అశ్వగంధతో మానసిక, శారీరక ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో అశ్వగంధను అడాప్టోజన్ అని పిలుస్తారు. దీనితో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. కార్టిసాల్ తగ్గించడం, ఒత్తిడివంటి ఇబ్బందులు తగ్గుతాయి. హార్మోన్ల అసమతుల్యత పురుషులు, స్త్రీలలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అశ్వగంధ సహజ అడాప్టోజెన్ గా పనిచేస్తుంది.

మెదడు తెలివితేటలను పెంచుతాయి. బైపోలార్ డిజార్డర్ ఉన్న వారిలో ఎనిమిది వారాల పాటు ప్రతిరోజూ 500mg అశ్వగంథను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.

ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం..

అశ్వగంధ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించే సామర్థ్యం పెంచుతాయి. రోజువారీ ఆందోళన, ఒత్తిడితో ఉండే వారికి మంచి ఔషదంగా పనిచేస్తుంది.

బ్లడ్ షుగర్, అధిక కొవ్వును తగ్గిస్తుంది.

అశ్వగంధ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.


Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!

కండరాలు, బలాన్ని పెంచుతాయి.

అశ్వగంథ కండాల పెరుగుదల, బలానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కండరాల శరీరక పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంది.

పురుషుల్లో సంతానోత్పత్తి..

టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ఇది పురుషుల్లో స్మెర్మ్ నాణ్యతను పెంచుతుంది.

The Heat Wave : వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?

దృష్టి, జ్ఞాపకశక్తికి పదును..

జ్ఞాపకశక్తిని పెంచుకునే విధానంలో దృష్టిలోపాలను సరిచేయడంలో అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

గుండె ఆరోగ్యానికి అశ్వగంధ పనిచేస్తుంది. అశ్వగంధ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది.

.


Diabetes Tips : మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఏంటో తెలుసా.. !

జుట్టుకు కూడా మంచి పోషణను ఇస్తుంది..

అశ్వగంధ జుట్టు పెలవంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి

Updated Date - May 06 , 2024 | 01:18 PM