Share News

Health Tips : యాపిల్ సైడర్ వెనిగర్ మొతాదుకు మించి తీసుకంటే.. ఇన్ని ఇబ్బందులా..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:54 PM

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువ కాలం వాడటం వల్ల జుట్టు రంగులో మార్పు కనిపిస్తుంది. చర్మం, జుట్టులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రోజులో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మాత్రమే వెనిగర్ తీసుకోవాలి.

Health Tips : యాపిల్ సైడర్ వెనిగర్ మొతాదుకు మించి తీసుకంటే.. ఇన్ని ఇబ్బందులా..!
apple cider vinegar

ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా రకాల డైట్ ఫ్లాన్స్ వచ్చేసాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధమైన ఫ్లాన్ ఫాలో కావడం మొదలు పెడుతున్నారు. దీనితో చాలావరకూ మంచి ఫలితాలే ఉన్నా, ఏదైనా అతి అయితే మాత్రం అది తప్పకుండా మన శరీరం మీదనే గుణం చూపిస్తుంది. కాబట్టి ఏదైనా ప్రారంభించే ముందు వైద్యుల సలహాను తీసుకోవడం ముఖ్యం. ఏ ఆహారపు అలవాటైనా మనకు ఇబ్బంది కలిగిస్తుందేమోననే స్పుహతో ఉండటం ముఖ్యం. లేకపోతే తిప్పలు తప్పవు. మామూలుగా బరువు తగ్గడానికి ఈ మధ్య కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారు చాలామంది. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు సరే కొన్ని ఇబ్బందులు కూడా తప్పవట.

1. యాపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ జ్యూస్ ఈస్ట్ కలయికతో పులియబెట్టి తయారు చేస్తారు. దీనిని డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు, మినరల్ అధికంగా ఉన్నాయి. ఎక్కువగా ఇతర ఉపయోగాల్లో చర్మం, జుట్టు సంరక్షణలో వాడతారు.

2. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగం ఎక్కువ అయితే చర్మం మీద దద్దుర్లు, చికాకు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని వాడే ముంచి చిన్నగా టెస్ట్ చేసుకున్నాకా వాడటం మొదలుపెట్టడం మంచిది.

3. మధుమేహం ఉన్నవారిలో కూడా అధిక వినియోగం వల్ల సమస్యలు వస్తాయి.


వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?

4. గ్యాస్ట్రోపరేసిస్ ఉన్నవారికి కడుపులోని నరాలు బిగ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు కడుపులో మంట, ఉబ్బరం వికారం ఉంటాయి. గుండెల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది

5. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు.

Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!

6. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువ కాలం పాటు తీసుకుంటే కనక రక్తంలో పొటాషియం స్థాయిలు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

7. అదే పిల్లలు దీనిని ఎక్కువగా తీసుకుంటే గొంతు మంట వస్తుంది.


ఎంత మోతాదులో తీసుకోవాలి..

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువ కాలం వాడటం వల్ల జుట్టు రంగులో మార్పు కనిపిస్తుంది. చర్మం మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రోజులో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మాత్రమే వెనిగర్ వేసుకుని తీసుకోవాలి. రోజులో గరిష్టంగా 2 టీస్పూన్ల కంటే ఎక్కువ మించకూడదు. సాధారణంగా ఈ వెనిగర్‌తో ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ అతిగా తీసుకంటే పైన లక్షణాలు కనుక కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 29 , 2024 | 02:02 PM