Share News

Growth Naturally: ఈ ఐదు రకాల మూలికలతోనూ జుట్టు పదిలం..!

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:53 PM

బృంగరాజ్.. దీనినే కేశరాజాఅని పిలుస్తారు, బృంగరాజ్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

Growth Naturally: ఈ ఐదు రకాల మూలికలతోనూ జుట్టు పదిలం..!
hair growth

పొడవాటి ఒత్తైన జుట్టు కావాలనేది ప్రతి స్త్రీ కోరిక. దీని కోసం జుట్టుకు చాలా పోషణ అవసరం. జుట్టు సంరక్షణలో భాగంగా స్కాల్ప్‌కు పోషణకు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న మూలికలు అవసరం. వీటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు సమస్యలు అనేకం దూరం అవుతాయి. వీటి గురించి తెలుసుకుందాం.

మందారం, ఉసిరి, గోరింటాకు, బృంగరాజ్ ఇవన్నీ ... జుట్టు పెరుగుదలకు, వెంట్రుకలు దృఢంగా మారేందుకు సహకరిస్తాయి. అలాగే హెయిర్ ఫోలికల్స్ ను ప్రేరేపిస్తాయి. వేగంగా జుట్టు పెరిగేలా సహకరిస్తాయి. వీటిని ఎలా వాడాలంటే..

గోరింటాకు.. చేతికి ఎర్రగా అందాన్నిస్తుంది. దీనితో అందమే కాదు. ఆరోగ్యం కూడా అందుతుంది. గోరింటాకు ముద్దను తలకు పట్టించుకోవడం వల్ల .. గోరింటాకు నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు అందంగా పెరుగుతుంది.

ఉసిరి.. దీనితో జుట్టు అందానికి ఢోకా లేదు. ఆరోగ్య పరంగా ఉసిరి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు అందాన్ని, పెరుగుదలను పెంచేందుకు ముందుంటుంది. దీనిని స్కాల్ప్ మసాజ్‌లా వాడినా సరిపోతుంది. లేదా పేస్ట్ రూపంలో తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. ఆమ్లాను టీ రూపంలో తీసుకున్నా బావుంటుంది. ఉసిరి నూనె కూడా జుట్టుకు మంచి బలాన్ని ఇస్తుంది.

బృంగరాజ్.. దీనినే కేశరాజాఅని పిలుస్తారు, బృంగరాజ్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లను, తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. మసాజ్‌లు, హెయిర్ మాస్క్‌ కోసం భృంగరాజ్ ఆయిల్‌ని ఉపయోగించవచ్చు లేదా రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌లో కూడా ఇన్‌ఫ్యూజ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: స్ట్రాబెర్రీలతో చర్మనిగారింపే కాదు, రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!


మెంతులు.. మెంతు గింజలు ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ యాసిడ్ నిధి, ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా మెత్తగా చేసి, పోషణ, స్కాల్ప్ స్టిమ్యులేషన్ కోసం తలకు అప్లై చేయాలి. మెంతులు బలమైన వాసన కలిగి ఉంటాయి.

రోజ్మేరీ.. ఈ సువాసనగల మూలికలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ మసాజ్‌ల కోసం రోజ్‌మేరీ ఆయిల్‌ సహకరిస్తుంది. రోజ్‌మేరీ టీని చేసి తలస్నానం తర్వాత జుట్టును ఈ టీతో కడిగినా కూడా ఫలితం ఉంటుంది. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

మందార... ఈ పువ్వులో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ మాస్క్ కోసం పెరుగుతో కలిపిన మందార పొడిని ఉపయోగించవచ్చు. అలాగే హెయిర్ రిన్స్‌గా మందార టీని కూడా తయారు చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 06 , 2024 | 01:53 PM