Share News

Technology : గూగుల్‌ జెమినీకి మెమరీ ఫీచర్‌ !

ABN , Publish Date - May 18 , 2024 | 01:01 AM

గూగుల్‌ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్‌ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్స్‌ను సేవ్‌ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది

Technology : గూగుల్‌ జెమినీకి మెమరీ ఫీచర్‌ !

గూగుల్‌ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్‌ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్స్‌ను సేవ్‌ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది.

చాట్‌జీపీటీ ఈ ఫిబ్రవరిలో విడుదల చేసిన ఫీచర్‌ మాదిరిగానే ఇది కూడా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి జెమినీ ‘మెమరీ’ అని పేరుపెట్టారు.

గత ఏడాదే ఈ వివరాలను ‘9టు5 గూగుల్‌’ బైటపెట్టింది. ఎక్స్‌ ద్వారా విడుదలైన స్ర్కీన్‌షాట్‌ ప్రకారం యూజర్‌ లైవ్‌, వర్క్‌, స్టడీ లేదంటే తనకు ఏవైనా అలర్జీలు ఉంటే అవి కూడా గుర్తు చేస్తుంది. ఉదాహరణకు ఒక యూజర్‌కు చిన్నపాటి అలెర్జీ ఉంది అనుకుందాం.


ఏదైనా ఆహార పదార్థం పడుతుందా లేదా అన్నది తెలియజేసి యూజర్‌ ఇబ్బంది పడకుండా చూస్తుంది. అలా యూజర్‌ వ్యక్తిజీవితంలోకి తొంగి చూస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చాట్స్‌తో షేర్‌ చేసిన విషయాలను గుర్తుంచుకుని తగు హెచ్చరికలు చేస్తూ ఉంటుంది.

యూజర్‌ అవసరాలను గురిస్తుంది. ఈ వెసులుబాటు వద్దనుకుంటే మెమరీని టర్నాఫ్‌ చేయవచ్చు. లేదంటే ఎప్పుడైనా ఇచ్చుకునేలా ఇన్ఫో మేనేజ్‌మెంట్‌ చేయవచ్చు.

Updated Date - May 18 , 2024 | 02:42 AM