Share News

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే అసలైన అందం

ABN , Publish Date - May 26 , 2024 | 02:55 AM

ఇన్‌స్టాలో అమైరా దస్తర్‌ చురుగ్గా ఉంటుంది. ముప్ఫై నాలుగు లక్షల మంది ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంటుంది అమైరా.

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే  అసలైన అందం

ఆమెకి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.

అయితే సినిమా అంటే ఇష్టం. మోడల్‌గా మొదలెట్టిన ఆమె కెరీర్‌.. నటిగా పేరు తెచ్చుకుంది. పేరు అమైరా దస్తర్‌.

‘మిస్టర్‌ ఎక్స్‌’, ‘రాజ్మా చావల్‌’, ‘జోగి’

లాంటి బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన అమైరా దస్తర్‌ గురించి కొన్ని విశేషాలు...

ఇన్‌స్టాలో అమైరా దస్తర్‌ చురుగ్గా ఉంటుంది. ముప్ఫై నాలుగు లక్షల మంది ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంటుంది అమైరా.

అలా పరిశ్రమలోకి...

ఆమె తండ్రి గుల్జార్‌ దస్తర్‌ ఒక వైద్యుడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమితాబ్‌కు వీరాభిమాని. ‘అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలు చూసి ఎదిగాను’ అంటుంది అమైరా.

తన స్కూల్‌లోని డ్రామా వర్క్‌షాప్స్‌లో బాగా పాల్గొనేది. ఆమె తల్లి... అమైరాను వర్క్‌షాప్‌లకు తీసుకుని వెళ్లేవారు. నాటకాల్లో బహుమతులు ఎన్నో గెలుచుకుంది ఈ తార. ‘‘ఏదో ఒక రోజు స్టార్‌ అయిపోతావు’ అనేది అమ్మ. నేనూ అలానే భావించేదాన్ని.

ఆ లక్ష్యంతోనే తొలుత మోడలింగ్‌ చేశా. నా పదహారేళ్ల వయసులో జీవితంలో తినటానికి సరిపడ డబ్బులు సంపాదించా’ అంటుంది అమైరా. అలాగని ఆమెకు అవకాశాలు సులువుగా రాలేదు.

తొలి ప్రాజెక్టు అవకాశం వచ్చినప్పుడు నాలుగు నెలల సమయం వేచి చూసింది. అనవసరంగా వచ్చానేమో! అనుకుంది కూడా. అయితే ఇంట్లో వాళ్ల సహకారంతో ఆమె నిరాశపడలేదు. అమైరా తొలి చిత్రం. ‘ఇస్సాక్‌’. మొదటి అడుగులోనే ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.


దక్షిణాది చిత్రాల్లోనూ..

కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అనేగన్‌’లో ధనుష్‌ జోడీగా అమైరా నటించింది. అలా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ‘కుంగ్‌ ఫూ యోగా’తో క్రేజ్‌ సంపాదించింది. తెలుగులోనూ ‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత హిందీ చిత్రాలకే పరిమితమైంది. ‘రాజ్మా చావల్‌’, ‘ప్రస్థానం’, ‘కోయి జానే నా’ ‘జోగీ’ చిత్రాల్లో నటించింది. ‘తాండవ్‌’ ‘బొంబాయ్‌ మేరీ జాన్‌’ లాంటి పాపులర్‌ వెబ్‌సిరీసుల్లో నటించింది.

అందుకే కాస్త భయంగా ఉంటా..

‘అనుకున్నవన్నీ జరగవు. ఒక్కోసారి మంచి ప్రాజెక్టులు సమయం కుదరక పోతుంటాయి. ఇకపోతే సెక్యూర్‌ కెరీర్‌ కాదిది. ఎంతో మంది మాకేదో కోట్ల డబ్బులు వస్తాయను కుంటారు. వచ్చినా జీఎస్టీలు, ఏజెన్సీ, పీఆర్‌ కోసం, జిమ్‌, డ్రెస్సులు, ప్రయాణాల కోసం ఖర్చులు అవుతాయి.

ఇవేమీ ఎవరికీ తెలియవు. ఇకపోతే నేను ఇండస్ర్టీ నేపథ్యం నుంచి రాలేదు కాబట్టి.. నాకు భయం కూడా కాస్త ఉంటుంది. అందుకే కాస్త జాగ్రత్తగా పని చేస్తా. ఏదేమైనా ఆత్మవిశ్వాసమే నా బలం... అదే నా అందం కూడా’ అంటుంది ఈ భామ.

Updated Date - May 26 , 2024 | 04:04 AM