Share News

Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:22 AM

దేశ రాజధాని పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. విద్యార్థులకు ఇంకా పుస్తకాలు పంపిణీ కాలేదన్న పిటిషన్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి

కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: జైలులో ఉన్నప్పటికీ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయకపోవటం వల్ల, మరొకరు ఆ బాధ్యతలు స్వీకరించకపోవటం వల్ల ఢిల్లీలో పాలన స్తంభించిపోతోందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసింది. ఓ స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిల్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పుస్తకాల పంపిణీకి సీఎం ఆమోదం అవసరమని, కానీ, ఆయన జైలులో ఉన్నారని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది చెప్పటంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.


విద్యార్థుల, ప్రజల ప్రయోజనాల కన్నా తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే కేజ్రీవాల్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడింది. దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైనవని ఇప్పటివరకూ తాము సంయమనంతో చెబుతూ వచ్చామని, కానీ ఇది తప్పని రుజువవుతోందని.. సోమవారం దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

Updated Date - Apr 27 , 2024 | 04:22 AM