Share News

Union Budget 2024: మధ్యంతర బడ్జెట్‌తో ఎవరెవరికి లాభనష్టాలు.. పూర్తి వివరాలివిగో!

ABN , Publish Date - Feb 01 , 2024 | 08:23 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో.. తమకు తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి భారీ ప్రకటనలు చేస్తారని అన్ని రంగాల వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆశించినట్టుగానే కొందరికి ప్రయోజనాలు చేకూరేలా నిర్మలా సీతారామన్ ప్రకటనలిచ్చారు.

Union Budget 2024: మధ్యంతర బడ్జెట్‌తో ఎవరెవరికి లాభనష్టాలు.. పూర్తి వివరాలివిగో!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో.. తమకు తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి భారీ ప్రకటనలు చేస్తారని అన్ని రంగాల వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆశించినట్టుగానే కొందరికి ప్రయోజనాలు చేకూరేలా నిర్మలా సీతారామన్ ప్రకటనలిచ్చారు. ముఖ్యంగా.. పేదలు, రైతులను ఆఖర్షించేలా హామీలు ఇచ్చారు. కానీ.. కొన్ని రంగాల వారికి మాత్రం నిరాశ తప్పలేదు. పదండి.. ఈ మధ్యంతర బడ్జెట్‌తో ఎవరెవరికి లాభనష్టాలు ఉండనున్నాయో తెలుసుకుందాం.


నష్టాలు

* ఎలక్ట్రిక్ వాహనాలు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కేంద్ర భావిస్తోంది. అయితే.. ఇందుకు అవసరమైన $1.2 బిలియన్ సబ్సిడీ ప్రోగ్రామ్ ఈ ఏడాది మార్చితో ముగియనున్నది. దీని పొడిగింపుపై నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

* మౌలిక సదుపాయాలు: మౌలిక వసతుల రంగానికి 11.11 శాతం వృద్ధితో రూ.11.11 లక్షల కోట్లను కేటాయించారు. అయితే.. ఈ రంగంలో సవాళ్లు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు గాను ఈ పెట్టుబడులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని ‘ఆనంద్ రాఠి గ్రూప్’ వైస్ ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు.

* జ్యువెలరీ: బంగారం దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 15% సుంకాన్ని తగ్గించకపోవడం వల్ల.. టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కో, కళ్యాణ్ జువెలర్స్ ఇండియా లిమిటెడ్, సెంకో గోల్డ్‌తో పాటు ఇతర ఆభరణాల స్టాక్‌లు గురువారం పడిపోయాయి. దిగుమతి సుంకం ఎక్కువగా ఉండటం వల్ల దేశంలోకి బంగారం అక్రమ రవాణి పెరిగిందని, కాబట్టి ఈ పన్నుని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు పదేపదే కోరినప్పటికీ.. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందుకే.. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ఆయా షేర్లు నష్టపోయాయి.

* పెట్టుబడుల ఉపసంహరణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని హై-టికెట్ వాటా విక్రయాలను ముగించడంలో విఫలం కావడంతో.. భారత్ తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.510 బిలియన్ల నుంచి రూ.300 బిలియన్లకు తగ్గించుకుంది. మార్చి 2024 నాటికి డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ నుంచి రూ. 300 బిలియన్లను పొందాలని అంచనా వేస్తోంది.

* పన్ను విధానాల్లో నో ఛేంజ్: సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. బడ్జెట్‌లో ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ.. కేంద్రం పన్ను విధానాల్లో మార్పుల జోలికి వెళ్లలేదు. గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు.


ప్రయోజనాలు

* వ్యవసాయం: సాగులో ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులు ప్రోత్సాహించడంతో పాటు నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేలా కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. అలాగే.. పాడి రైతుల అభివృద్ధి, మత్స్య సంపద పెంచేందుకు సరికొత్త ప్రణాళికలను తీసుకురానుంది.

* మధ్య తరగతి ప్రజలు: ఎవరైతే (బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు) సొంతింటి కలని సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నారో, వారి కోసం ‘హౌసింగ్ స్కీమ్’‌ని తీసుకురానున్నారు. దీనికితోడు.. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గేలా ‘‘రూఫ్‌ టాప్‌ సోలారైజేషన్‌’’ పథకాన్ని అమలు చేయనున్నారు.

* టూరిజం: ఈసారి కేంద్రం పర్యాటక రంగానికి పెద్ద పీట వేసింది. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు, వాటిని ప్రపంచ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు గాను.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ప్రోత్సాహించనుంది. ఇందుకోసం.. రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Updated Date - Feb 01 , 2024 | 08:23 PM