Share News

Rahul Gandhi: వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు... రాహుల్ గాంధీ తొలి రియాక్షన్

ABN , Publish Date - Jun 17 , 2024 | 09:33 PM

రాయబరేలి సీటును ఉంచుకుని వయనాడ్‌ను వదులుకోవాలని తీసుకున్న నిర్ణయంపైన, ప్రియాంక గాంధీని వయనాడ్‌ నుంచి ఉపఎన్నికల బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించడం పైన రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. ప్రియాంకను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం ప్రజలకు ఇద్దరు ఎంపీలు అందుబాటులో ఉంటారని అన్నారు.

Rahul Gandhi: వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు... రాహుల్ గాంధీ తొలి రియాక్షన్

న్యూఢిల్లీ: రాయబరేలి సీటును ఉంచుకుని వయనాడ్‌ను వదులుకోవాలని తీసుకున్న నిర్ణయంపైన, ప్రియాంక గాంధీని వయనాడ్‌ నుంచి ఉపఎన్నికల బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించడం పైన రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారి స్పందించారు. వయనాడ్‌ను తాను వదులుకున్నా తరచు వెళ్తుంటానని, ప్రియాంకను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం ప్రజలకు ఇద్దరు ఎంపీలు అందుబాటులో ఉంటారని అన్నారు.

Rahul Gandhi: వయనాడ్‌ను వదులుకున్న రాహుల్.. ఉపఎన్నికల బరిలో ప్రియాంక


భావోద్వాగానికి గురయ్యా..

''వయనాడ్, రాయబరేలితో నాకు భావోద్వేగాలతో కూడిన అనుబంధం ఉంది. ఐదేళ్లుగా నేను వయనాడ్‌ ఎంపీగా ఉన్నాను. ప్రజలు నాపై చూపించిన ప్రేమకు, ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. నేను కూడా క్రమం తప్పకుండా వయనాడ్‌లో పర్యటిస్తుంటాను. రాయబరేలితో నాకు చిరకాల అనుబంధం ఉంది. తిరిగి వారికి ప్రాతినిధ్యం వహించనుండటం కూడా సంతోషంగా ఉంది. వయనాడ్ వదులుకోవడానికి ఎంతో మదనపడ్డాను. ప్రియంక వయనాడ్‌కు ఉత్తమ ప్రతినిధి కాబోతోందని నమ్ముతున్నాను. నేను సైతం వయనాడ్ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ కొనసాగిస్తుంటాను. వయనాడ్‌కు రెండో ఎంపీగా సేవలందిస్తూనే ఉంటాను'' అని రాహుల్ అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 09:33 PM