Share News

Lok Sabha Elections: ముగిసిన పోలింగ్... 57.70 శాతం పోలింగ్ నమోదు

ABN , Publish Date - May 25 , 2024 | 06:22 PM

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మందకొడిగా మొదలైన 6వ విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. పశ్చిమబెంగాల్‌లో అత్యథికంగా 77.99 శాతం పోలింగ్ నమోదైంది.

Lok Sabha Elections: ముగిసిన పోలింగ్... 57.70 శాతం పోలింగ్ నమోదు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం మందకొడిగా మొదలైన 6వ విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో అత్యథికంగా 77.99 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో అత్యల్పంగా 51.35 శాతం నమోదైంది. ఢిల్లీలో 53.73 శాతం, బీహార్‌లో 52.24, జార్ఖాండ్‌లో 61.41, ఉత్తరప్రదేశ్‌లో 52.02, ఒడిశాలో 59.60, హర్యానాలో 55.93 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ డాటా తెలిపింది.

Arvind Kejriwal: పాక్ మంత్రికి క్లాస్ పీకిన కేజ్రీవాల్


ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు, హర్యానాలోని 10, బీహార్‌లో 8, పశ్చిమబెంగాల్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖాండ్‌లో 4, ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరిలోనూ ఈరోజు పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ముగియడంతో ఇంకా మిగిలిన 57 లోక్‌సభ స్థానాలకు ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. దీంతో ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 06:23 PM