Share News

VHP: ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు స్వేచ్ఛ కల్పించాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:29 AM

ఆలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాలన్న డిమాండ్‌ను వీహెచ్‌పీ తీవ్రం చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిం ది.

VHP: ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు స్వేచ్ఛ కల్పించాలి

  • దేశవ్యాప్తంగా ‘జాగరణ్‌ అభియాన్‌’ ప్రచారం 5న విజయవాడలో ప్రారంభం: వీహెచ్‌పీ

న్యూఢిల్లీ, డిసెంబరు 27: ఆలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాలన్న డిమాండ్‌ను వీహెచ్‌పీ తీవ్రం చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిం ది. ఆలయాలను ప్రభుత్వాల నియంత్రణ నుంచి బయటకు తీసుకురావాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనవరి 5వ తేదీ నుంచి ‘జాగరణ్‌ అభియాన్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యనిర్వాహక ప్రఽధాన కార్యదర్శి మిలింద్‌ పరండే వెల్లడించారు.


ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి ఈ క్యాంపెయిన్‌ ప్రారం భం అవుతుందని, 2 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలోని ప్రముఖ వ్యక్తులు, సాధువుల నాయకత్వంలో ఈ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 06:29 AM