Share News

Delhi: మణిపూర్‌ హింసపై అమెరికా నివేదిక

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:32 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: మణిపూర్‌లో జాతుల ఘర్షణలో జరిగిన ఘోరాలను అగ్రరాజ్యం అమెరికా మానవ హక్కుల నివేదిక-2023 తూర్పారబట్టింది. మెజారిటీలైన మైతీలు, గిరిజన కుకీ తెగ మధ్య జాతుల వైరంతో యథేచ్ఛగా జరిగిన మూక దాడులు, సామూహిక అత్యాచారాలను నివేదిక ప్రస్తావించింది.

Delhi: మణిపూర్‌ హింసపై అమెరికా నివేదిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: మణిపూర్‌లో జాతుల ఘర్షణలో జరిగిన ఘోరాలను అగ్రరాజ్యం అమెరికా మానవ హక్కుల నివేదిక-2023 తూర్పారబట్టింది. మెజారిటీలైన మైతీలు, గిరిజన కుకీ తెగ మధ్య జాతుల వైరంతో యథేచ్ఛగా జరిగిన మూక దాడులు, సామూహిక అత్యాచారాలను నివేదిక ప్రస్తావించింది. కనీసం 175 మంది చనిపోయారని, 60 వేల మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో విలేకరులపై దాడులు, అక్రమ అరెస్టులు, అసమ్మతివాదుల గొంతునొక్కేందుకు క్రిమినల్‌ చట్టాలను ప్రయోగించడంపైనా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట డాక్యుమెంటరీని ప్రసారం చేసిన తర్వాత బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించడం, విలేకరుల సామగ్రిని సీజ్‌ చేయడాన్నీ నివేదిక ప్రస్తావించింది. కెనడాలో సిక్కు ఉద్యమకారుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురైన విషయాన్నీ పేర్కొంది. ఆ హత్యలో ప్రభుత్వ ఏజెంటుల పాత్ర ఉందని ఆక్షేపించింది.

Updated Date - Apr 24 , 2024 | 06:38 AM