Share News

భవిష్యత్తు చూడాలంటే భారత్‌కు రావాలన్న మెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:49 AM

భవిష్యత్తును చూడాలని అనుకునే వారు భారతదేశానికి రావాలని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న గార్సెటి.. భారతదేశం సాధించిన పురోగతి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించడంలో భారత్‌ పాత్రను కొనియాడారు.

భవిష్యత్తు చూడాలంటే భారత్‌కు రావాలన్న మెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి

భవిష్యత్తును చూడాలని అనుకునే వారు భారతదేశానికి రావాలని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి అన్నారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న గార్సెటి.. భారతదేశం సాధించిన పురోగతి, ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించడంలో భారత్‌ పాత్రను కొనియాడారు. ఈ సదస్సులో మాట్లాడుతూ ‘‘మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే.. భవిష్యత్తును ఆస్వాదించాలి అనుకుంటే..భవిష్యత్తు కోసం పని చేయాలని అనుకుంటే భారత్‌కు రండి. భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న నేను నిత్యం దానిని ఆస్వాదిస్తున్నాను’’ అని గార్సెట్టి పేర్కొన్నారు. తాను ఈ సదస్సుకు వచ్చింది పాఠాలు చెప్పడానికి కాదని నేర్చుకునేందుకుని వెల్లడించారు. వివిధ రంగాల్లో భారత్‌, అమెరికా అనుబంధం కొత్త శిఖరాలకు చేరిందని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలివాన్‌ అన్నారు. మరోపక్క, మోదీ భారతదేశ ముఖచిత్రంగా మారారని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2024 | 08:49 AM