Union Minister: బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన ప్రధాని పర్యటన
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:00 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహం వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్(Minister L. Murugan) పేర్కొన్నారు.
- కేంద్రమంత్రి ఎల్.మురుగన్ వెల్లడి
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మంచి ఉత్సాహం వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్(Minister L. Murugan) పేర్కొన్నారు. ఆయన గురువారం తిరుచ్చెందూరు మురుగన్ ఆలయంలో సుబ్రమణ్యస్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బుధవారం తూత్తుకుడిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని రూ.17,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఒక్క కులశేఖరపట్టణంలోనే రూ.986 కోట్ల విలువైన మినీ రాకెట్ ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేశారన్నారు. అదేవిధంగా వీవోసీ హార్బర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, గత పదేళ్ళకాలంలో రూ.11 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించినట్టు గుర్తు చేశారు. వచ్చే 2047కు భారత్ అభివృద్ధి దేశంగా మారుతుందన్నారు. ప్రఽధాని మోదీ రాష్ట్ర పర్యటన పెనుమార్పులకు నాంది పలకగా, ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో జోష్ మరింతగా పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలపై ప్రధాని మోదీకి అమితమైన ప్రేమాభిమానాలున్నాయని మంత్రి మురుగన్ వెల్లడించారు.