Share News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టుల హతం?

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:00 PM

ఛత్తీస్‌గఢ్‌ లోని కంకేర్‌ జిల్లాలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరితో సహా 18 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 29 మంది మావోయిస్టుల హతం?

కంకేర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని కంకేర్‌ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్‌ రావు సహా 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. శంకర్‌పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడినట్టు కంకేర్ ఎస్‌పీ ఐకే ఏలేసెల తెలిపారు. ఘటనా స్థలి నుంచి 7 ఏకే-47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఛోటెబతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన కాంకెర్ జిల్లాలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 07:51 PM