Share News

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:37 AM

కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

  • గత 5 దఫాలుగా ఆ 13 సీట్లూ కీలకం

న్యూఢిల్లీ, జూన్‌ 2: కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.

ఫలితాల రోజున చివరకు ఎవరు గెలుస్తారనేది ఇక్కడి ట్రెండ్స్‌ సూచిస్తుంటాయి. ప్రాంతీయ (Regional), జాతీయ(National), స్థాయిలో ప్రభావం చూపుతుంటాయి. 1999 నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు ఇదే జరిగింది.

వల్సాద్‌, బనస్కాంత, జామ్‌నగర్‌, ఆనంద్‌ (అన్నీ (Gujarat) గుజరాత్‌).. ఫరీదాబాద్‌ (Faridabad), కర్నాల్‌ ( kurnool), అంబాలా (హరియాణా) Ambala (Haryana)... జమ్ము (jammu) , ఉధంపూర్‌ (జమ్మూకశ్మీరు) Udhampur (Jammu and Kashmir)... ఆల్వార్‌ (రాజస్థాన్‌) Alwar (Rajasthan)... సికింద్రాబాద్‌ (తెలంగాణ) Secunderabad (Telangana), ససారం (బిహార్‌) Sasaram (Bihar), రాంచీ (జార్ఖండ్‌) Ranchi (Jharkhand) స్థానాల్లో 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఆ రెండు సార్లూ ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. 1999, 2014, 19ల్లో బీజేపీ విజయం సాధించి గద్దెనెక్కింది.

Updated Date - Jun 03 , 2024 | 05:37 AM