Share News

Supreme court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్ట్ మండిపాటు

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:15 PM

డీఎంకే నేత కే.పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరించిన తమిళనాడు గవర్నర్ రవిపై (Governer Ravi) సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిగా నియమించేందుకు గవర్నర్ తిరస్కరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు ఇటీవలే సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే గవర్నర్ తిరస్కరించడంతో ప్రమాణస్వీకారం నిలిచిపోయింది.

Supreme court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్ట్ మండిపాటు

న్యూఢిల్లీ: డీఎంకే నేత కే.పొన్ముడిని (K. Ponmudi) మంత్రిగా నియమించేందుకు నిరాకరించిన తమిళనాడు (Tamilanadu) గవర్నర్ రవిపై (Governer Ravi) సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిగా నియమించేందుకు గవర్నర్ తిరస్కరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు ఇటీవలే సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే గవర్నర్ తిరస్కరించడంతో ప్రమాణస్వీకారం నిలిచిపోయింది.

పొన్ముడి జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే మాత్రమే విధించిందని, పూర్తిగా కొట్టేయలేదని గవర్నర్ రవి కారణంగా పేర్కొన్నారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ జరిపింది. గవర్నర్ చర్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. గవర్నర్ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 22వ తేదీలోగా పొన్ముడి చేత ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

Loksabha Elections: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

Loksabha Polls: రూ.25 వేల కాయిన్లతో కలెక్టరేట్‌కు.. షాక్‌కి గురైన సిబ్బంది.. ఎందుకంటే

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 04:28 PM