Share News

Delhi: బాలిక గర్భాన్ని తొలగించుకోవచ్చు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:59 AM

అత్యాచారానికి గురైన బాలిక 28 ఏళ్ల గర్భాన్ని తొలగించుకోవడానికి సుప్రీం కోర్టు(Supreme Court) అనుమతించింది. ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Delhi: బాలిక గర్భాన్ని తొలగించుకోవచ్చు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఢిల్లీ: అత్యాచారానికి గురైన బాలిక 28 ఏళ్ల గర్భాన్ని తొలగించుకోవడానికి సుప్రీం కోర్టు(Supreme Court) అనుమతించింది. ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదికను అపెక్స్ కోర్టు పరిగణలోకి తీసుకుంది.

గర్భం కొనసాగిస్తే బాలిక మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించినట్లు సుప్రీం కోర్టు వెబ్‌సైట్ పేర్కొంది.


అసలేమైందంటే..

ముంబయికి చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమె 28 వారాల గర్భవతి అని తెలియగానే తల్లి షాక్‌కి గురైంది. కుమార్తె గర్భం తొలగించడానికి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు పిటిషన్‌ని తిరస్కరించడంతో ఆమె సుప్రీం తలుపు తట్టింది. వైద్యపరంగా గర్భం తొలగించాలంటే పిండం వయసు గరిష్ఠంగా 24 వారాలకు మించరాదని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం చెబుతోంది.

కోర్టు గర్భవిచ్ఛితికి అనుమతించే అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే వైద్యుల సలహా కోరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారంలోగా నివేదిక అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా ధర్మాసనం ఏప్రిల్ 19న ఆదేశించింది. సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ బాలిక పంపిన ఈమెయిల్‌ సందేశంపై స్పందించిన ధర్మాసనం సమావేశం నిర్వహించింది. ఈ దశలో గర్భం తొలగిస్తే బాలికపై శారీరకంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పాలని ముంబైలోని సియోన్ ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది.

ఇందులో భాగంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించింది. ఈ క్రమంలో వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు విచారణ సాగింది. బాలిక తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 11:59 AM