Share News

INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:25 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీలో కూటమిలోని 14 మంది నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తదితరులు ఈ మెగా ర్యాలీకి హాజరవుతున్నారు.

INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ
INDIA bloc leaders

రాంచీ, ఏప్రిల్ 21: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహిస్తుంది. న్యాయ తిరుగుబాటు పేరుతో ప్రభాత్ తారా గ్రౌండ్‌ వేదికగా ఈ ర్యాలీ చేపట్టనుంది.

ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతతోపాటు హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్‌, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు పాల్గొనున్నారు.

Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

జార్ఖండ్ సీఎం చంపి సోరెన్ మాట్లాడుతూ.. నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు. అలాగే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీ, జార్ఖండ్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసిందేనన్నారు.

ఈ ర్యాలీ ద్వారా కేంద్రంలోని నియంత వైఖరిని బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని తొలి నుంచి అస్థిర పరిచేందుకు కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు. ఆ క్రమంలో తుదకు హేమంత్‌ను జైలుకు పంపారన్నారు. ఢిల్లీ ప్రజలకు సైతం ఇదే తరహా అనుభవం ఎదురైందన్నారు.

Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్


ఇక శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. బీజేపీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం ఉందని, అలాగే నిరుద్యోగం తాండవిస్తుందని చెప్పారు. మహిళల రక్షణ కల్పించే వాతావరణమే లేదన్నారు. దేశంలో చాలా మంది ఓటర్లు.. తొలి దశ పోలింగ్‌కు దూరంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

ఓటర్లంతా బయటకు వచ్చి ఓట్లు వేస్తేనే.. కేంద్రంలోని అధికారాన్ని మార్చగలమన్నారు. మరోవైపు ఈ ర్యాలీకి తాను హాజరు కాలేక పోతున్నట్లు హేమంత్ సోరెన్ భార్య కల్పనకు సీపీఐ (ఎం) సీతారాం ఏచూరి కాలేకపోతున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని.. అందుకే ఈ ర్యాలీకి హాజరుకాలేకపోతున్నట్లు ఆయన వెల్లడించారు.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు


ఇక ఇండియా కూటమి మెగా ర్యాలీపై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండి స్పందించారు. అభివృద్ధికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీరంతా ర్యాలీ పేరుతో ఏకమవుతున్నారని విమర్శించారు. కేంద్రంలో నాడు వాజపేయ్ ప్రభుత్వం లేకుంటే.. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేదే కాదని మరాండి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Viral Video: గురుగ్రామ్‌లో విషాదం.. స్మశాన వాటిక గోడ కూలి 5 మంది..

జార్ఖండ్‌లోని అదివాసుల మనోభావాలను బీజేపీ, ఎన్డీయే మాత్రమే అర్థం చేసుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం సంకీర్ణ కూటమి అవినీతి వల్ల గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని వనరులను దోచేశారని ఆయన ఆరోపించారు.

Tamilisai: ఆ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ జరపండి: తమిళిసై

మార్చి 31న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలో లోకతంత్ర బచావో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రతిపాక్ష పార్టీలకు చెందిన నాయకులంతా హాజరయ్యారు. తాజాగా రాంచీ వేదికగా జరుగుతున్న ఈ ర్యాలీకి సైతం ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం హాజరవుతున్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 21 , 2024 | 04:25 PM