Share News

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ హతం

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:21 PM

ఛత్తీస్‌గఢ్‌‌లోని జిజాపూర్ జిల్లాలో బుధవారంనాడు భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛికుర్‌భట్టి, పుష్బక గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు.

Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ హతం

బిజాపూర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని జిజాపూర్ జిల్లాలో బుధవారంనాడు భారీ ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛికుర్‌భట్టి, పుష్బక గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ (Naxals) హతమయ్యారు. భద్రతా దళాల సంయుక్త బృందం ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందరరాజ్ తెలిపారు.


సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఎలైట్ యూనిట్ కోర్డా (కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఈ ఆపరేషన్ పాల్గొందని, ఎదురెదురు కాల్పుల అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమమయ్యాయని, వారిలో ఒక మహిళా నక్సలైట్ ఉందని సుందరరాజ్ తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే బిజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగాల్సి ఉంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 02:32 PM