Share News

SBI: స.హ చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వం

ABN , Publish Date - Apr 12 , 2024 | 09:03 AM

సమాచార హక్కు (సహ) చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలను అందజేసేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది. ఇప్పటికే ఆ వివరాలన్నీ ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ.. డబ్బుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమైనందున బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్‌బీఐ తెలియజేయడం గమనార్హం.

SBI: స.హ చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు (సహ) చట్టం కింద ఎన్నికల బాండ్ల వివరాలను అందజేసేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది. ఇప్పటికే ఆ వివరాలన్నీ ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ.. డబ్బుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమైనందున బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్‌బీఐ తెలియజేయడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీకి సమర్పించిన ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను డిజిటల్‌ రూపంలో అందజేయాలని సామాజిక కార్యకర్త లోకేశ్‌ బాత్రా సహ చట్టం కింద మార్చి 13న ఎస్‌బీఐని కోరారు. అలాగే సుప్రీంకోర్టులో బ్యాంకు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్‌ సాల్వేకు చెల్లించిన రుసుము వివరాలనూ వెల్లడించాలన్నారు. అయితే ఎన్నికల బాండ్లలో వ్యక్తిగత సమాచారం ఉన్నందున.. ఆ వివరాలను అందజేయలేమని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. సాల్వే ఫీజు వివరాలను ఇచ్చేందుకూ నిరాకరించింది.

Updated Date - Apr 12 , 2024 | 09:03 AM