Share News

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:36 PM

అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం వెలిగిపోతోంది.

Ayodhya: అయోధ్యలో ఘనంగా హోలీ వేడుకలు.. రంగోత్సవంతో భక్తుల కోలాహలం

అయోధ్య: అయోధ్య(Ayodhya) శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. హోలీ కారణంగా అయోధ్య పట్టణం, శ్రీ రామ చంద్రుడి గుడి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. హోలీ వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులు స్వామివారికి గులాల్ పూశారు.

రంగోత్సవం జరుపుకున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వామివారి అలంకరణ, భక్తులకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. భక్తి గీతాలు ఆలపిస్తూ పండుగ రంగులు అద్ది హోలీ వేడుకలు జరుపుకున్నారు భక్తులు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి హోలీ వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జరిగిన విషయం తెలిసిందే.


ఇదే తొలి రంగుల పండుగ కావడంతో అయోధ్య పట్టణమంతా రంగులమయంగా మారింది. దేశంలో ఏటా మార్చి 25న ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ముందు హోలికా దహన్ అని పిలిచే భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది.

ఇది హోలికా అనే రాక్షసుడిని దహనం చేస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం ఆనందోత్సాహాల మధ్య స్వీట్లు పంచుకుంటారు. హోలీ పండుగతో ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని పెంపొందుతుందని నమ్ముతారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 03:40 PM