Rahul Gandhi: వయనాడ్ వదులుకోనున్న రాహుల్.. కీలక ప్రకటనకు రెడీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:08 PM
పోటీ చేసిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉండటంతో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. గాంధీ కుటుంబ నియోజకవర్గంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి సీటును ఉంచుకుని, కేరళలో గెలిచిన వయనాడ్ సీటును రాహుల్ వదులుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పోటీ చేసిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉండటంతో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. గాంధీ కుటుంబ నియోజకవర్గంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి (Raebareli) సీటును ఉంచుకుని, కేరళలో గెలిచిన వయనాడ్ (Wayanad) సీటును రాహుల్ వదులుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై సోమవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ సమావేశమై ఒక నిర్ణయాన్ని ప్రకటించనుంది. రాహుల్ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నారనే సమాచారాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌కు తెలియజేయడానికి ఇవాళే చివరిరోజు.
వయనాడ్ నుంచి ప్రియాంక
కాగా, రాహుల్ వదులుకోవాలనుకుంటున్న వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాని పోటీలోకి దించనున్నారని, తద్వారా ఈ సీటును కూడా కాంగ్రెస్ తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
Bengal Train Accident: ‘కాంచన్ జంఘా’పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
లోక్‌సభ విపక్ష నేత పగ్గాలు చేపడతారా?
మరోవైపు, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ ఆశిస్తుండగా, రాహుల్ మాత్రం ఇందుకు సుముఖంగా లేరని పార్టీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయనకు క్యాబినెట్ ర్యాంకు హోదా, ఇండియా బ్లాక్ భాగస్వాముల మధ్య మంచి సమన్వయం సాధించేందుకు వీలున్నప్పటికీ ఆయన మాత్రం ఆ బాధ్యతను స్వీకరించేందుకు ఇష్టపడటం లేదని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశారని కూడా తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..