Share News

Rahul Gandhi: చైర్‌పర్సన్‌ పదవి వద్దన్న రాహుల్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:45 AM

ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని కూటమి చైర్‌పర్సన్‌గా నియమించాలని జేఎంఎం నేత, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ ప్రతిపాదించారు.

Rahul Gandhi: చైర్‌పర్సన్‌ పదవి వద్దన్న రాహుల్‌

న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)ని కూటమి చైర్‌పర్సన్‌గా నియమించాలని జేఎంఎం నేత, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ ప్రతిపాదించారు. తాను భారత్‌జోడో న్యాయయాత్ర చేపడుతున్నందున ఆ బాధ్యత తీసుకోలేనని రాహుల్‌ సున్నితంగా తిరస్కరించారు. ఖర్గే పేరును సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించగా మిగతా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా సీట్ల పంపిణీ విషయంపై తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని సమావేశం తర్వాత ఖర్గే తెలిపారు. రాహుల్‌ యాత్రలో వీలును బట్టి పాల్గొనాల్సిందిగా ఖర్గే చేసిన అభ్యర్థనకు మిత్రపక్షాలు సానుకూలంగా స్పందించాయి.

Updated Date - Jan 14 , 2024 | 08:45 AM