Share News

Pen Drive Videos: పోలీసులకు డేట్.. టైమ్.. చెప్పిన ప్రజ్వల్

ABN , Publish Date - May 27 , 2024 | 04:44 PM

రాసలీలల పెన్ డ్రైవ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ కేసులో సిట్ ‌ముందు హాజరవుతానని ప్రజ్వల్ తెలిపారు.

Pen Drive Videos: పోలీసులకు డేట్.. టైమ్.. చెప్పిన ప్రజ్వల్

బెంగళూరు, మే 27: రాసలీలల పెన్ డ్రైవ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ కేసులో మే 31వ తేదీ ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ‌ముందు హాజరవుతానని ప్రజ్వల్ సోమవారం స్పష్టం చేశారు. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానన్నారు. తనకు న్యాయవ్యవస్థలపైన చట్టాలపైన నమ్మకం ఉందని తెలిపారు. అయితే తనపై తప్పుడు కేసుల పెట్టారంటూ ప్రజ్వల్ ఈ సందర్బంగా ఆరోపించారు. అలాగే ఈ ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవేనన్నారు. జేడీ(ఎస్) నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్బంగా ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రజ్వల్ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

LokSabha Elections: వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం


సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రాసలీలల పెన్ డ్రైవ్ బహిర్గతమైంది. దాంతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. అదీకాక ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకొని లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజ్వల్ అంశం ప్రచారాస్త్రంగా మారింది.

Cyclone Remal: నలుగురు మృతి

అలాగే ప్రజ్వల్‌తోపాటు అతడి తండ్రి హెచ్ డి రేవణ్ణ బాధితులు పలువురు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజ్వల్‌పై ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ప్రజ్వల్ రాసలీల వీడియోలు బహిర్గతం కావడంతో.. అతడు జర్మనీ వెళ్లిపోయాడు. ఆ క్రమంలో జేడీఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని దేవగౌడ్ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి.

YS Jagan: ఖైదీ నెంబర్ 6093 @ 12 ఏళ్లు


Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!

అలాంటి వేళ దేవగౌడ.. తన మనవడు ప్రజ్వల్‌కు బహిరంగ లేఖ రాసి.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి, ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు. అంతేకాదు.. ఈ కేసు విషయంలో తన సహానాన్ని పరీక్షించవద్దంటూ ప్రజ్వల్‌కు దేవగౌడ చురకలంటించారు.

MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు

అలాగే ప్రజ్వల్‌పై ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా తమ కుటుంబం ఆవేదన అనుభవిస్తుందని దేవగౌడ ఈ సందర్బంగా వెల్లడించిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం ప్రజ్వల్ ఎక్కడ ఉన్నది ఇంకా తెలియరాలేదు.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 05:00 PM