Share News

Pongal: పొంగల్‌ నగదు కానుకపై వీడిన సస్పెన్స్‌.. రేషన్‌షాపుల్లోనే రూ.1000 పంపిణీ

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:44 AM

గత వారం రోజులుగా పొంగల్‌ నగదు కానుకపై కొనసాగిన సస్పెన్స్‌ ఎట్టకేలకు వీడింది. పొంగల్‌(Pongal) తయారీకి అవసరమైన సరుకులతోపాటు రూ.1000 నగదును కూడా రేషన్‌షాపుల్లోనే పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రకటించారు

Pongal: పొంగల్‌ నగదు కానుకపై వీడిన సస్పెన్స్‌.. రేషన్‌షాపుల్లోనే రూ.1000 పంపిణీ

- సీఎం స్టాలిన్‌ తీపికబురు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): గత వారం రోజులుగా పొంగల్‌ నగదు కానుకపై కొనసాగిన సస్పెన్స్‌ ఎట్టకేలకు వీడింది. పొంగల్‌(Pongal) తయారీకి అవసరమైన సరుకులతోపాటు రూ.1000 నగదును కూడా రేషన్‌షాపుల్లోనే పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. వారం రోజుల క్రితం పొంగల్‌ సందర్భంగా బియ్యం కార్డుదారులకు చక్కెర పొంగలి తయారీకి అవసరమైన కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర, ఒక చెరకు గడను పంపిణీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రకటన జారీ అయ్యింది. ఆ ప్రకటనలో యేటా చెల్లించే రూ.1000 నగదు కానుక పంపిణీపై ఎలాంటి వివరాలు లేకపోవడంతో ఎనిమిది జిల్లాల్లో వరద పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నగదు కానుక పంపిణీని ప్రభుత్వం నిలిపివేయనున్నదని రాష్ట్రవ్యాప్తంగా వదంతులు వ్యాపించాయి. అదే సమయంలో పొంగల్‌ నగదు కానుకపై ప్రకటన చేయని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister MK Stalin) దూషిస్తూ సామాజిక ప్రసార మాధ్యమాల్లో వీడియోలు కూడా హల్‌చల్‌ చేశాయి. పొంగల్‌ నగదు కానుక పంపిణీ అవుతుందో లేదోనని బియ్యం కార్డుదారులంతా అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అందరి అనుమానాలను నివృత్తి చేసేలా పొంగల్‌ నగదు కానుకను రేషన్‌షాపుల్లోనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. పొంగల్‌ కానుకలతోపాటు యేటా బియ్యం కార్డుదారులకు ఇచ్చే ఉచిత చీరలు, ధోవతులను కూడా అందించనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత చీరలు, ధోవతులను సకాలంలో లబ్ధిదారులకు అందించనున్నామని తెలిపారు. కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసేవారు, చక్కెరకార్డుదారులు మినహా తక్కిన ఉచిత బియ్యం కార్డుదారులందరికీ పొంగల్‌ కానుకలు, ఉచిత చీరలు, ధోవతులు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.

nani3.jpg

10న కలైంజర్‌ సాధికారిక నగదు...

1.15 కోట్ల మంది గృహిణులకు కలైజర్‌ మహిళా సాధికారిక నగదుగా ఇచ్చే రూ.1000ను ఈనెల 10న వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్టాలిన్‌ పేర్కొన్నారు. సంకాంత్రి పండుగను పురస్కరించుకుని గృహిణులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నగదును నిర్దేశిత తేదీ కంటే ఐదు రోజులు ముందుగానే జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 08:44 AM