Share News

PMK Ramdas: పిల్లల పేర్లు తమిళంలో ఉంటే.. రూ.5,000 బహుమతి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:32 AM

పాట్టాలి మక్కల్‌ కట్చి తరఫున 2024-25వ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ షాడో బడ్జెట్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌(Anbumani Ramdas) బుధవారం చెన్నైలో విడుదల చేశారు.

PMK Ramdas: పిల్లల పేర్లు తమిళంలో ఉంటే.. రూ.5,000 బహుమతి

- జిల్లాల సంఖ్య 60కి పెంపు

- పీఎంకే షాడో బడ్జెట్‌

చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి తరఫున 2024-25వ సంవత్సరానికి సంబంధించి జనరల్‌ షాడో బడ్జెట్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌(Anbumani Ramdas) బుధవారం చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ.5,12,617 కోట్లుగా ఉంటుందని, ఇది గత సంవత్సరం కంటే రూ.1,94,144 కోట్లు అధికమన్నారు. ఖనిజ సంస్థలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా పన్ను లేని ఆదాయంగా రూ.2,00,180 కోట్లు రాబట్టుకోవచ్చని తెలిపారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రప్రభుత్వ ప్రస్తుత రుణభారాన్ని అదుపులోకి తీసుకురావచ్చన్నారు.

వాటిపై 30 శాతం పన్ను...

శీతలపానీయాలు, చక్కెర, పిజ్జా, బర్గర్‌, శాండ్‌విచ్‌, షవర్మా వంటి తీపి, ఉప్పు, కొవ్వు శాతం కలిగిన పదార్థాలపై 30 శాతం పన్ను విధించాలని, అంతేకాకుండా రాష్ట్రంలో వచ్చే జూలై 25న కులగణన చేపట్టాలని, యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి వంటి మత్తుపదార్ధాలు పూర్తిస్థాయిలో అదుపుచేసేలా పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ప్రారంభం, మే 1వ తేది నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధ చట్టాన్ని అమలుపరిచేలా తమ షాడో బడ్టెజ్‌ రూపొందించినట్లు చెప్పారు. గృహిణుల సౌకర్యార్థం వంటగ్యా్‌సకు రూ.500 రాయితీ పంపిణి చేస్తామని, పేద కుటుంబాలకు నెలా నెలా పంపిణీ చేస్తున్న రూ.1,000ని రూ.2,000కు పెంచడంతో పాటువృద్ధులు, అనాథలఆర్ధికసాయం రూ.3,000పెంచుతామని తెలిపారు.

nani3.2.jpg

తమిళంలో పేర్లు పెడితే...

పిల్లలకు తమిళంలో పేరు పెట్టే తల్లిదండ్రులకు బహుమతిగా రూ.5,000 అందిస్తామని, అలాగే, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో తమిళంలో పేరు పలకలు ఏర్పాటుచేస్తే రూ.1,000 ఇస్తామని తెలిపారు. తమిళ మీడియంలో చదువుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, ఈ విద్యార్థులకు ఉన్నత విద్యలో 30 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామన్నారు. చదువుకొని ఐదేళ్లకు పైగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నెలకు రూ.5,000 వరకు ఉపకార వేతనం, రాజధాని నగరంలో రద్దీని పూర్తిస్థాయిలో తగ్గించేలా కోయంబేడు బస్‌ టెర్మినల్‌ను వేరే ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.

బస్సు ఛార్జీలు పెంచబోం...

రాష్ట్రప్రభుత్వ బస్సుల్లో ఛార్జీలు పెంచబోమని అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 టోల్‌గేట్ల సంఖ్యను 17కు తగ్గిస్తామని, విద్యుత్‌ ఛార్జీలను నెలకోసారి మీటరు రీడింగ్‌ ఉంటుందన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాల స్మార్ట్‌ కార్డ్‌ పంపిణీ చేస్తామన్నారు. ఇక రాష్ట్ర అసెంబ్లీ కనీసం మూడేళ్లకు ఒకసారి, 100 రోజులకు ఒకసారి సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించేందుకు, జిల్లాల సంఖ్యను 60గా పెంచే చర్యలు చేపడతామని, ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల పనిగంటలు 8గా నిర్ణయించేలా తమ పార్టీ తరఫున బడ్జెట్‌ నివేదికను రూపొందించామని అన్బుమణి తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 11:32 AM