Share News

PM Surya Ghar Muft Bijli Yojana: గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్..!

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:42 PM

PM Surya Ghar Muft Bijli Yojana: ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం.

PM Surya Ghar Muft Bijli Yojana: గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్..!
PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana: ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన పీఎం మోదీ.. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి రూ. 75,000 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి నెలా 300 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపుతామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..

‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రారంభిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 75,000 కోట్లతో, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

Updated Date - Feb 13 , 2024 | 04:43 PM