Share News

PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముందంటే

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:26 PM

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) శనివారం లేఖ రాశారు. అందులో ప్రధానంగా విక్షిత్ భారత్ గురించి ఆయన ప్రస్తావించారు. భారతదేశ భవిష్యత్తును 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం)గా పునర్నిర్మించడంలో పౌరులు చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.

PM Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముందంటే

ఢిల్లీ: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) శనివారం లేఖ రాశారు. అందులో ప్రధానంగా విక్షిత్ భారత్ గురించి ఆయన ప్రస్తావించారు. భారతదేశ భవిష్యత్తును 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం)గా పునర్నిర్మించడంలో పౌరులు చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రగతిశీల దేశం కోసం పౌరుల మద్దతు ఎంత ముఖ్యమో ఆయన గుర్తు చేశారు.

"ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో పౌరులు తమ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలి. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రజలు ముందుకు రావాలి. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ సర్కార్ ఎన్నో అభివృద్ధి పథకాలను చేపట్టింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. నిరుపేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. తద్వారా ఆయా వర్గాల ప్రజల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. దేశ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను. సంస్క్రతీసంప్రదాయాలు కాపాడుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాం. జీఎస్టీ అమలు, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టాలు, ఆర్టికల్ 270 రద్దు, నారీ శక్తి బంధన్ వంటి అనేక చట్టాలు తీసుకొచ్చాం. తద్వారా మహిళల సాధికారితకు పెద్ద పీట వేశాం. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తగ్గించగలిగాం" అని మోదీ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 04:27 PM