Share News

PM Modi: దక్షిణాది పర్యాటనలో ప్రధాని మోదీ.. మహిళా సంఘాలకు నిధుల విడుదల

ABN , Publish Date - Feb 27 , 2024 | 10:10 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నుంచి రెండు రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో కేరళ, తమిళనాడు ఉండగా.. మహారాష్ట్రలో కూడా ఆయన పర్యటన సాగనుంది.

PM Modi: దక్షిణాది పర్యాటనలో ప్రధాని మోదీ.. మహిళా సంఘాలకు నిధుల విడుదల

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నుంచి రెండు రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో కేరళ, తమిళనాడు ఉండగా.. మహారాష్ట్రలో కూడా ఆయన పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో ఆయన కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

కేరళలో..

కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో మోదీ పర్యటన సాగనుంది. PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (PIF), సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీతో సహా మొత్తం రూ.1,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. వీటితో భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉపగ్రహ ప్రయోగాల ఫ్రీక్వెన్సీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

గగన్‌యాన్ మిషన్‌..

మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ పురోగతిని ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. అంతరిక్ష పరిశోధనలో పురోగతి సాధించిన వ్యోమగాములకు ఆయన 'ఆస్ట్రోనాట్ వింగ్స్' ప్రదానం చేస్తారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఆటోమోటివ్ పరిశ్రమలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)కి మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. TVS ఓపెన్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్, TVS మొబిలిటీ-CII సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.


తూత్తుకుడిలో..

చిదంబరనార్ ఓడరేవులో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌కు, దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా పోర్టులను తీర్చిదిద్దే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

రైలు, రోడ్డు ప్రాజెక్టులు

తమిళనాడులో రైలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. కొత్త రహదారులను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో నీటిపారుదల ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

రైతులు, మహిళా సంఘాలతో..

ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో రైతులతో సమావేశం అవుతారు. పీఎం-కిసాన్, నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి పథకాల కింద నిధులను విడుదల చేస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిధులు విడుదల చేస్తారు. OBC లబ్ధిదారుల కోసం మోదీ ఆవాస్ ఘర్కుల్ యోజనను ప్రారంభిస్తారు. యావత్మాల్ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 10:13 AM