Share News

Petro-Diesel Price: కేంద్రం మరో బంపర్ న్యూస్.. పెట్రోల్, డీజిల్‌పై భారీగా తగ్గింపు

ABN , Publish Date - Mar 16 , 2024 | 09:17 PM

సార్వత్రిక ఎన్నికలు (2024 Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) బంపర్ న్యూస్ ప్రకటించింది. పెట్రోల్ (Petrol), డీజిల్‌పై (Diesel) ఏకంగా రూ.15.3లను తగ్గించింది.

Petro-Diesel Price: కేంద్రం మరో బంపర్ న్యూస్.. పెట్రోల్, డీజిల్‌పై భారీగా తగ్గింపు

సార్వత్రిక ఎన్నికలు (2024 Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) బంపర్ న్యూస్ ప్రకటించింది. పెట్రోల్ (Petrol), డీజిల్‌పై (Diesel) ఏకంగా రూ.15.3లను తగ్గించింది. అయితే.. ఈ ఆఫర్ కేవలం లక్షద్వీప్ (Lakshadweep) ప్రజలకు మాత్రమే. లక్షద్వీప్‌లోని ఆండ్రోట్, కల్పేని దీవుల్లో రూ.15.3.. కవరత్తి, మినికాయ్‌లలో లీటరుకు రూ.5.2 తగ్గింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్దిసేపు ముందు ఇంధన ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ (Hardeep Singh Puri) ఎక్స్ వేదికగా వెల్లడించారు.


‘‘లక్షద్వీప్ ప్రజలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా తగ్గించింది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో రూ.15.3 గానూ.. కవరతి, మినికాయ్‌లలో రూ.5.2 గానూ లీటరుపై తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు రాజకీయ నేతలు తమ కుటుంబ సభ్యులతో లక్షద్వీప్‌లో సెలవులు గడిపేందుకు వచ్చేవారు. అయితే.. లక్షద్వీప్ ప్రజలను తన కుటుంబంగా భావించిన తొలి నాయకుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీనే (PM Narendra Modi). ఇదీ మోదీ గ్యారెంటీ’’ అంటూ హర్దీప్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం లక్షద్వీప్ టూరిజంకు ఎందో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది వికసిత్ భారత్‌కు నిదర్శనమని చెప్పుకొచ్చారు.

కాగా.. అంతకుముందు రోజు కూడా కేంద్రం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గించింది. దాదాపు రెండేళ్ల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా.. ఇప్పుడు ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల మే 13వ తేదీన ఉండనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 09:17 PM