Share News

Narendra Modi: వెడ్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రజలు పాటించాలి

ABN , Publish Date - Mar 07 , 2024 | 03:42 PM

ఆర్టికల్ 370 నిబంధనను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో ప్రధాని మోదీ రూ.6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన క్రమంలో దేశంలో పెళ్లిళ్ల గురించి ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేశారు.

 Narendra Modi: వెడ్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రజలు పాటించాలి

ఆర్టికల్ 370 నిబంధనను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌(srinagar)లో ప్రధాని మోదీ రూ.6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో బక్షి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. నేడు అంకితం చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) అభివృద్ధికి ఊతం ఇస్తాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు.

అంతేకాదు ప్రధానంగా జమ్మూకశ్మీర్‌లో 'వెడ్ ఇన్ ఇండియా'(Wed in India) కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యం ప్రధాని అన్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులకు ఈ సందేశం ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటి వారు జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం ద్వారా ప్రతి వ్యక్తి వారి పర్యటన నిమిత్తం బడ్జెట్‌లో కనీసం 5-10 శాతం స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇక్కడి ప్రజల ఆదాయం పెరిగి, ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.


ఇప్పుడు వెడ్ ఇండియా కింద ప్రజలు వివాహం(wedding) కోసం ఇక్కడికి రావాలని అన్నారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారని ఈ క్రమంలో పేర్కొన్నారు. వీరి ద్వారా దాదాపు రూ.75,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు వ్యయం అవుతుందని వెల్లడించారు. అటువంటి పరిస్థితిలో, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో నిర్వహిస్తే, ఆ డబ్బు దేశంలోనే ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో 'ఛలో ఇండియా' కార్యక్రమం కింద, ఎన్నారైలు(NRIs) కనీసం ఐదుగురు కుటుంబ సభ్యులను భారతదేశానికి పంపాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు 370 ఆర్టికల్ విషయంలో కాంగ్రెస్(congress) ప్రభుత్వం ఇక్కడి ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకశ్మీర్‌లో అవినీతి, బంధుప్రీతి ఎక్కువగా ఉండేవని ప్రధాని మోదీ(pm modi) వ్యాఖ్యానించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఆ పార్టీలో చేరనున్నారా? వారి భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

Updated Date - Mar 07 , 2024 | 03:45 PM