Share News

Lok Sabha Polls: బీజేపీకి బిగ్ రిలీఫ్.. అలక వీడిన పశుపతి పరాస్..

ABN , Publish Date - Mar 31 , 2024 | 10:37 AM

బీహార్‌లో బీజేపీకి బిగ్ రిలీఫ్ లభించింది. పొత్తుల్లో భాగంగా తమ పార్టీకి ఒక సీటు కేటాయించకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆర్‌ఎల్‌జేపీ అధినేత పశుపతి పరాస్ అలక వీడారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించారు.

Lok Sabha Polls: బీజేపీకి బిగ్ రిలీఫ్.. అలక వీడిన పశుపతి పరాస్..

బీహార్‌లో బీజేపీ(BJP)కి బిగ్ రిలీఫ్ లభించింది. పొత్తుల్లో భాగంగా తమ పార్టీకి ఒక సీటు కేటాయించకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆర్‌ఎల్‌జేపీ అధినేత పశుపతి పరాస్ అలక వీడారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించారు. దీంతో పశుపతి పరాస్ పార్టీ బీహార్‌(BIHAR)లోని 40 లోక్‌సభ స్థానాలకు ఎన్‌డిఎ విజయం కోసం ప్రచారం చేయనున్నారు. పశుపతి పరాస్ హాజీపూర్ నుండి పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. చివరికి ఆయన పోటీలో ఉండనని చెప్పడంతో ఎన్డీయే కూటమికి లైన క్లియర్ అయింది.

పశుపతి పరాస్ ప్రధాని మోదీతో ఉన్న ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేశారు. తమ పార్టీ NDAలో అంతర్భాగమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా మా నాయకుడే, ఆయన నిర్ణయమే మాకు ప్రధానం. అతని నాయకత్వంలో, NDA మొత్తం దేశంలో 400కు పైగా సీట్లను గెలుచుకుని మూడవసారి రికార్డు స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

BJP: ఓటింగ్ లేదు కౌంటింగ్ లేదు..ఎన్నికలకు ముందే 10 అసెంబ్లీ సీట్లు గెల్చుకున్న బీజేపీ

అలక ఎందుకు..?

పొత్తులో భాగంగా బీజేపీ చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీఆర్‌కు 5 లోక్‌సభ సీట్లు కేటాయించింది. సీట్ల సర్ధుబాటులో పశుపతి పరాస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో పశుపతి పరాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ముందు, పశుపతి మోడీ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ మంత్రిగా ఉన్నారు. అంతే కాకుండా సీట్ల కేటాయింపు విషయంలో తనతో ఎవరూ మాట్లాడలేదని ఆరోపించారు. ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో తనకు, తన పార్టీకి అన్యాయం జరిగిందన్నారు. తాజాగా అలక వీడి ఎన్డీయేకు మద్దతుగా ఉంటానని చెపపారు. , నా పార్టీకి అన్యాయం జరిగిందని అన్నారు.

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా తర్వాత, పశుపతి పరాస్ ఇండియా కూటమితో జతకట్టవచ్చని వార్తు వచ్చాయి. అయితే బీహార్‌లో 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుండగా.. జేడీయూకు 16 సీట్లు రామ్‌విలాస్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీకి 5 సీట్లు, జితన్ రామ్ మాంఝీ పార్టీకి 1 సీటు, ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ జనతాదళ్‌కు ఒక సీటు దక్కింది.

Maha Rally: నేడు రాంలీలా మైదాన్‌లో భారత్ కూటమి మహార్యాలీ..ట్రాఫిక్ ఆంక్షలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 10:51 AM