PM Modi: మీతో మీరే పోటీ పడండి.. పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:38 PM
విద్యార్థుల రిపోర్ట్ కార్డ్‌ను విజిటింగ్ కార్డ్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన పరీక్ష పే చర్చ(Pariksha Pe Charcha) కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.
ఢిల్లీ: విద్యార్థుల రిపోర్ట్ కార్డ్‌ను విజిటింగ్ కార్డ్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన పరీక్ష పే చర్చ(Pariksha Pe Charcha) కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. జీవితంలో పోటీ, సవాళ్లు సాధారణమే అని.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుని ముందుకుసాగాలని చెప్పారు. స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అన్నారు.
"మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. అది వారి భవిష్యత్తుకు హాని కలిగించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తారు. ఇది మంచిది కాదు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి.
తద్వారా పరీక్షలు బాగా రాయగలరు. విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుంది. వీటిని అధిగమించాలి. విద్యార్థులే దేశ భవిష్యత్తు రూపకర్తలు. పరీక్షా పే చర్చ కార్యక్రమం నాకూ పరీక్ష లాంటిది. " అని మోదీ అన్నారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలని ప్రధాని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి