Ooty: ‘జిల్లు’ మంటున్న ఊటీ..
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:47 AM
నీలగిరి(Neelagiri) జిల్లాలో ప్రతి ఏడాది అక్టోబరు నెలాఖరు వరకు నీటి మంచు కనిపిస్తుంది. నవంబరు రెండో వారం నుంచి చలికాలం ప్రారంభమవుతుంటుంది. ఈ ఏడాది కొన్ని నెలలుగా అప్పుడప్పుడూ భారీ వర్షాలు కురుస్తుండడంతో, కొద్దిరోజులుగా ఎండ తీవ్రత కూడా నెలకొంది.

- పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లాలో ప్రతి ఏడాది అక్టోబరు నెలాఖరు వరకు నీటి మంచు కనిపిస్తుంది. నవంబరు రెండో వారం నుంచి చలికాలం ప్రారంభమవుతుంటుంది. ఈ ఏడాది కొన్ని నెలలుగా అప్పుడప్పుడూ భారీ వర్షాలు కురుస్తుండడంతో, కొద్దిరోజులుగా ఎండ తీవ్రత కూడా నెలకొంది. గత వారం నుంచి ఊటీలో మంచు కురవడం ప్రారంభమైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు నమోదయ్యాయి. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసింది. శివారు ప్రాంతాలైన కాంతల్, కలైకుంద, హెచ్‌పీఎఫ్, షూటింగ్ స్పాట్ తదితర ప్రాంతాల్లో మంచుతో ఎదురుగా వచ్చే వారు కూడా కనిపించని స్థితి నెలకొంది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: మరణిస్తూ... ఆరుగురికి పునర్జన్మ
కనిష్ట ఉష్ణోగత్ర 1 డిగ్రీ సెల్సియస్...
ఈ నేపథ్యంలో, ఊటీలో గరిష్ట ఉష్ణోగత్ర 17 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 3.2 డిగ్రీలు, శివారు ప్రాంతాల్లో 1 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. మంచు కారణంగా ఉదయం చలి తీవ్రత కూడా ఉంది. ఉదయం తేయాకు, కొండల్లోని కాయగూరల తోటలకు వెళ్లేందుకు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో, ఊటీ బొటానికల్ గార్డెన్‌లో పూల మొక్కలు దెబ్బతినకుండా పార్క్ అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News